ఏపీలో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమయింది. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారంటూ వైసీపీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వారిలో ఇద్దరు ఇంతకు ముందే పార్టీకి దూరమయ్యారు. ఇద్దరు తమను సస్పెండ్ చేసినందుకు సంతోషం అంటున్నారు. కానీ తాము క్రాస్ ఓటింగ్ చే్శామని మాత్రం అంగీకరించడం లేదు. తమను సస్పెండ్ చేస్తే మంచిదే కానీ.. క్రాస్ ఓటింగ్ చేశామన్న నింద మాత్రం వేయవద్దని వారంటున్నారు.
మరో వైపు టీడీపీ కూడా ఈ అంశం వైసీపీ అంతర్గత అంశమని.. తమ పార్టీకి ఏం సంబంధం లేదని అంటున్నారు. తమకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తాము విప్ జారీ చేశామని వారంతా ఓటు వేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైతే ఈ అంశంపై స్పందించకూడదని డిసైడయ్యారు. సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యేల చేరిక.. సీట్ల కేటాయింపుల అంశంపై ఇప్పుడల్లా మాట్లాడకూడదని నిర్ణయించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పిటకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
టీడీపీ ఎవరితోనూ క్రాస్ ఓటింగ్ కోసం చర్చలు జరపలేదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీకి దూరమైన ఇద్దరు ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు లెక్కలోకి తీసుకోలేదు. వారు ఓటు వేయలేదు. మిగిలిన రెండు ఓట్లలో ఎవరు ఓటు వేశారో స్పష్టత లేదు. మేకపాటి కానీ.. ఉండవల్లి శ్రీదేవి కానీ టీడీపీ నేతలతో టచ్ లోకి ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు. వీరు జగన్ పై వ్యతిరేకతతో షాక్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. ఈ మత్తం వ్యవహారంలో టీడీపీ మాత్రం మాకు 23 మంది ఎమ్మెల్యేలు.. మాకు వచ్చిన ఓట్లు 23 అనే దానికి ఫిక్సయ్యారు.