ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎంవో కార్యాలయం నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఉన్న పళంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వారాలని ఆయనకు పిలుపునిచ్చారని ప్రో వైసీపీ మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. ఏదో లేకపోతే పిలవరని చెబుతున్నారు. ఆయన మంత్రి పదవికి గండం వచ్చి పడిందన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సీదిరి అప్పలరాజు చుట్టూ అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి. ఆయన ముగ్గురు వ్యక్తులని పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన సవాల్ చేస్తున్నారు.
మరో వైపు ఆయన నిర్వహించే శాఖలో ఓ దళిత వైద్యుడ్ని తోటి ఉద్యోగులు దారుణంగా చంపేశారు. అది కడపలోనే జరిగింది. ఈ విషయంలోనూ కొన్ని అంతర్గత ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సుల్లోనూ ఆయన అవినీతిపై ఓటర్లు లేఖలు వేశారు. త్వరలో సీఎం జగన్ మంత్రివర్గాన్ని మార్చబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఎన్నికల టీమ్‌ను ఖరారు చేసుకుంటారని ఇందులో భాగంగా కొంత మంది మంత్రుల్ని తప్పిస్తారని చెబుతున్నారు.
మంత్రి సీదిరి అప్పలరాజు తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచితనప్పటికీ… సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారు. మోపిదేవిని తప్పించి అదే సామాజికవర్గం నుంచి సీదిరి అప్పలరాజుకు చాన్స్ ఇచ్చారు. న్యాయవ్యవస్థపై కించ పరిచే వ్యాఖ్యలు చేసి ఆయన జగన్ దృష్టిని ఆకర్షించారు. మంత్రులందరితో రాజీనామాలు తీసుకున్నప్పుడు సీదిరి అప్పలరాజుతోనూ రాజీనామా చేయించారు.. కానీ మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవి కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు మాత్రం గండం వచ్చినపడినట్లుగా అయితే అప్పల్రాజు మాత్రం తనను ఎవరూ పిలవలేదని.. మంత్రి పదవి పోయినా బాధపడేది లేదని చెబుతున్నారు.