అఖిల్ ‘ఏజెంట్’ పరిస్థితి ముందు నుంచి అయోమయంగానే వుంది. ఎప్పుడో పుర్తవ్వాల్సిన సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ ఇచ్చారు గానీ ఇంకా కొంత ప్యాచ్ వర్క్ వుందని ఇన్ సైడ్ టాక్. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఎట్టి పరిస్థితిలోనైనా అదే డేట్ కి వచ్చేయాలనేది నిర్మాతల ఆలోచన. ఏప్రిల్ 28 అంటే సరిగ్గా నెల రోజులు కూడా లేదు.
ఏజెంట్ ని పాన్ ఇండియా ఫిల్మ్ అన్నారు. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఒక టీజర్ వదిలారు. అయితే ఆ వేడి అప్పుడే చల్లారిపోయింది. ఈ మధ్య రెండు పాటలు కూడా వదిలారు గానీ అవి రొటీన్ గా వున్నాయి. ఇప్పుడు ఏజెంట్ కి బలమైన ప్రమోషన్ కావాలి.. కానీ ఈ విషయంలో ఏజెంట్ సైలెంట్ గా వున్నాడు. మొన్నటి వరకూ క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా వున్నాడు అఖిల్. ఇప్పుడు విడుదల తేది దగ్గర పడింది. మరి ఇప్పటికైన ఏజెంట్ లో చలనం వస్తుందోమో చూడాలి.