మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో కూర్చుని తీరిగ్గా జాక్వలైవ్ ఫెర్నాండెజ్‌కు ప్రేమ లేఖలు రాసుకునే సుకేష్ చంద్రశేఖర్ ఈ సారి బీఆర్ఎస్, ఆప్‌ను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పినట్లు బీఆర్ఎస్ కు రూ.15 కోట్లు చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు. కారులో ఉన్న వ్యక్తి ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని చెబుతున్నారు. ఆయనిప్పుడు లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు.
త్వరలోనే కేజ్రీవాల్ తో మాట్లాడిన వాట్సాప్ చాట్ బయటపెడతానని సుఖేష్ చెబుతున్నారు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు చెప్పినట్లు డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. వారంలో కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు వస్తాయన్నారు. చాటింగ్ లో కోడ్ పదాలు వాడారన్నారు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించానన్నారు. కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతానని సుఖేష్ అన్నారు. దిల్లీ అరవింద్ కేజ్రీవాల్‌తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లు చేశానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో తెలిపారు. కే
సుఖేష్ రాసినఈ లేఖను బీజేపీ వర్గాలు వైరల్ చేస్తున్నాయి. ఇటీవల సుఖేష్ చంద్రశేఖర్ ను కోర్టులో హాజరుపరిచినప్పుడు కేజ్రీవాల్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని, ఆయన త్వరలో తీహార్ క్లబ్లో వస్తారని జోస్యం చెప్పారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఇదే చెబుతున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్సే ఆప్‌కు డబ్బులు చెల్లించిందని చెబుతున్నారు కానీ.. ఇక్కడ రివర్స్‌లో కేజ్రీవాల్ చెప్పాడని… బీఆర్ఎస్కు ఇచ్చానని సుఖేష్ చెబుతున్నారు. ఇదే కాస్త తేడాగా ఉందని.. స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోవాల్సిందని బీఆర్ఎస్ నేతలు సలహా ఇస్తున్నారు.
అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ… రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఇంద్రాణి ముఖర్జీయాతోనూ ఇలాంటి లేఖలో చిదంబరం, ఆయన కుమారుడిపై ఆరోపణలు చేసేందుకు రాయించారని గుర్తు చేసుకుంటున్నారు.