వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూ మీద కలిసి పోరాటం చేద్దామని ప్రతిపాదన పెట్టారు. నిజానికి షర్మిల ఇలా ఇద్దరికి ఫోన్ చేస్తున్నట్లుగా తెలియదేమో కానీ ఇద్దరూ స్పందించారు. కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కానీ.. పార్టీలో చర్చించుకుని చెబుతామన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోరాటం చేసే చాన్స్ లేదు. షర్మిల కావాలనుకుంటే ఆ పార్టీతో కలిసి ఆ పార్టీతో పోరాటం చేయవచ్చు.
తాను ఇలా ఇద్దరికీ ఫోన్లు చేశానని షర్మిల ప్రకటించుకోవడంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ నేతులు కూడా ఆశ్చర్యపోయారు. బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి పోరాటం చేయడం ఎలా సాధ్యమని షర్మిల మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని సెటైర్లు వేస్తున్నారు. గతంలో షర్మిలపై దాడి జరిగినప్పుడు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. ప్రధాని కూడా పరామర్శించారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్లీ రెండు పార్టీలు కలిసి నడుస్తున్నట్లుగా ప్రచారం అయితే జరగడంలేదు.
షర్మిల పాదయాత్ర హఠాత్తుగా పోలీసులు నిలిపివేసిన తర్వాత చేయడానికి ఏమీ కనిపించడంలేదు. ఎప్పుడో ఓ సారి ట్యాంక్ బండ్పై ధర్నా చేయడం.. లాంటి కార్యకలాపాలుతప్ప ఏమీ లేవు. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టలేదు. పాలేరులో తాను పోటీ చేాయలనుకుంటున్నందున అక్కడ మాత్రం కొంత ఖర్చుపెట్టి ప్రజలకు నగదు పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.