ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వైసీపీకి తిరుగలేని రికార్డు వైసీపీ చేజేతులా వారి ఆగ్రహానికి గురవుతోంది. ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలు భయంభయంగా బతుకుతున్నారు. మావోయిస్టులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనంతటికి కారణంగా వెనుకబడిన తరగతులకు చెందిన బోయవాల్మీకి, బెంతోరియా కులాలను గిరిజనుల జాబితాలో చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడమే. దీన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
బోయవాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మన్యం ప్రాంతలంలో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. బంద్ కూడా నిర్వహించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం ద్వారా సీఎం జగన్ గిరిజన ద్రోహిగా మిగిలిపోయారని ఇతర పార్టీలు, సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కొవ్వొత్తులతో వేర్వేరుగా నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ప్రభుత్వ తీర్మానంతో నిజమైన ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు దూరమవుతాయని, వారి మనుగడ దెబ్బతింటుందని గిరిజనులు అంటున్నారు.
గిరిజనుల్లో ఆగ్రహాన్ని గుర్తించిన వైసీపీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అయితే అవి బోయవాల్మీకి, బెంతు ఒరియా కులాలను మోసం చేస్తున్నామని చెబుతున్నట్లుగా ఉన్నాయి. అసలు రిజర్వేషన్ల వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం కలగదని చెబుతున్నారు. బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చడం వల్ల కేవలం గ్రూప్ 1 ఉద్యోగాల్లో 22 ఉద్యోగాలమీదే పోటీ ఉంటుందని చెబుతున్నారు. 0 గ్రహించిన ఎస్టీలను సంతజృప్తి పరచడానికి ఆ రిజర్వేషన్ల వల్ల వాల్మికీ బోయలకు కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పడం ఏమిటన్న విస్మయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది.