ఎవరైనా మనకు రావాల్సిన నిధుల్ని డిమాండ్ చేసి మరీ తెచ్చుకుంటారు కానీ … అవి ఇవ్వకపోయినా పర్వాలేదు అప్పులు ఇప్పించండి చాలు అంటారా ? ఏ మాత్రం బాధ్యత లేని వ్యక్తులు… మనది కాదుగా అనుకునేవారే ఇలా చేస్తారు. ఇలాంటి మనస్థత్వంతోనే ఏపీ ప్రభుత్వం ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రూ. పది వేల కోట్ల వరకూ గ్రాంట్లు రావాల్సి ఉంది. పంచాయతీలకు రావాల్సిన రూ. రెండు వేల కోట్ల వరకూ ఆర్థిక సంఘం నిధులూ రాలేదు. ఇవి వస్తాయని ఆశతో ప్రభుత్వం కూడాచాలా మంది బిల్లులు చెల్లించడానికి ప్లాన్ చేసుకుంది. కానీ అన్నీ రివర్స్ అయ్యాయి.
ఈ నిధుల కోసం సీఎం జగన్ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ను కలశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగారు. కానీ జగన్కు కేంద్ర అధికారులు షాకిచ్చారు. కేంద్ర నిధులు విడుదల చేయడం అంటే… అప్పనంగా చేసేయరని.. దానికి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని.. అవేమీ రాష్ట్రం పాటించలేదని గుర్తు చేశారు. సాధారణంగా ఈ గ్రాంట్లన్నీ… ఖర్చు చేస్తేనే రీఎంబర్స్ చేస్తారు. అలాగే కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లుగా ఇస్తారు. అవేమీ రాష్ట్ర ప్రభుత్వం వైపు చేయకుండా.. .నేరుగా డబ్బులు ఇవ్వాలని అడగడంతో సాధ్యం కాదని తేల్చి పంపేసింది కేంద్రం. దీంతో చివరికి అప్పులు అయినా ఇప్పించండి…. వచ్చే ఏడాది ఖాతాలో తగ్గించుకోండి అని బతిమాలుకోవడంతో దేశంలో ఎవరికీ ఇవ్వని విధంగా ఏపీకి రూ. మూడు వేల కోట్ల అప్పులకు పర్మిషన్ ఇచ్చారు.
ఈ నెలలో ఇప్పటి వరకూ కనీసం సామాజిక పెన్షన్లు కూడా పంపిణీ చేయలేదు. బ్యాంకుల సెలవు పేరుతో ఆపేశారు. శనివారం కూడా బ్యాంకులు పని చేశాయి. ఆదివారం సెలవు పేరుతో పించన్ల పంపిణీ నిలిపివేయడం డబ్బులు లేకనే. కేంద్రం నుంచి వస్తాయన్న నిధులు రాకపోవడం…. అప్పులు పుట్టడంతో మంగళవారం తర్వాత కొన్ని పథకాలకు డబ్బులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాలు ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పడం కష్టమంటున్నారు. ఎలా చూసినా సీఎం జగన్ అత్యంత దారుణమైన ఆర్థిక నిర్వహణ పాలన చేస్తున్నారని తేలిపోతోంది. ముందు ముందు ఏపీ పరిస్థితి దారుణంగా ఉండబోతోందన్న సంకేతాలు అందుతున్నాయి.