గుడ్మార్నింగ్ ధర్మవరం పేరుతో ఊళ్లో తిరుగుతూ మంచి సర్కాస్టిక్ వీడియోలు చేయించుకుని యూట్యూబ్లో వైరల్ చేయించుకుంటున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురించి ఇప్పుడు ధర్మవరంలోనే కాదు… ఏపీ మొత్తం చర్చించుకుంటున్నారు. చుట్టూ నీరు ఉంటుంది. ఓ ఒడ్డున మంచి ఇల్లు ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం తోట. అంటే మూడు వైపులా నీరు.. ఒక వైపు మాత్రం ఇల్లు.. గేటు ఉంటుంది. సుదూరంలో మరో ఇల్లు ఉండదు. అలాంటి ఇంట్లో జల్సా చేయాలని ఎవరు కోరుకోరు ? అందరూ కోరికుంటారు.. కానీ ఆ కోరికుల్ని తీర్చుకునేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో కేతిరెడ్డి ఒకరు.
నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన చెరువును కబ్జా చేసి కట్టిన ఇల్లును డ్రోన్ కెమెరాతో షూట్ చేసి మరీ చూపించారు. ఆ ఇల్లు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేకు చాలా మంచి టేస్ట్ ఉందని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇంట్లో ఎమ్మెల్యే ఏం చేస్తారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎవరి ఊహాశక్తికి తగ్గట్లుగా వారు చర్చించుకుంటున్నారు. తన తండ్రి .. ఫ్యాక్షన్ లీడర్ అయిన కేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి హత్యకు గురి కావడంతో వైఎస్ ఆయనకు ఎమ్మెల్యే చాన్సిచ్చారు. గతంలో ఓ సారి గెలిచారు. అప్పట్లో కొత్త ఎమ్మెల్యే కావడం.. వైఎస్ అంత చాన్స్ ఇవ్వలేదేమో కానీ… అప్పట్లో ఇలాంటి ఆలోచనలు చేయలేదు. ఓ సారి ఓడిపోయారు. గత ఎన్నికల్లో మళ్లీ గెలిచారు.
ఈ సారి ఆయన మాత్రం జూలు విదిల్చారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో కిటుకులు పట్టుకున్నారు. ధర్మవరంలో కబ్జాలు ప్రారంభించారు. తన కోరికలు తీర్చుకుంటున్నారు. ఆయన లైఫ్ స్టైల్ చూసి… ధర్మవరం ప్రజలు కూడా మా ఎమ్మెల్యే విలాస పురుషుడని చర్చించుకుంటున్నారు. కానీ ఆయన చేసే వ్యాపారాలేమీ ఉండవు. కానీ ఆయనకు మాత్రం వందల కోట్లు ఆస్తులు ఈ కొద్ది కాలంలోనే వచ్చి పడ్డాయి. వాటిని ఆయన ప్రదర్శించుకుంటున్నారు. ప్రజలకు దొరికిపోయారు.