ఏపీలో మహామహులైనా వైఎస్ఆర్ తర్వాతే. దేశానికి వారెంత సేవలు చేసినా డోంట్ కేర్. ఫుట్ పాత్ దగ్గర్నుంచి పారిశ్రామిక విధానాల వరకూ అన్నింటికీ వైఎస్ఆర్ పేరే. తాజాగా విశాఖలో బీచ్ వ్యూ పాయింట్ కు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. అంతకు ముందు ఈ వ్యూ పాయింట్‌కు అబ్దుల్ కలాం పేరు ఉండేది. దంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా దుమారం రేగింది. ప్రభుత్వ పేర్ల మార్ప కక్కుర్తిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ వ్యూ పాయింట్ సీతంకొండ సమీపంలో ఉంటుంది. కి ఈ వ్యూపాయింట్ ను గతంలో ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలేదు. వైజాగ్ వాలంటీర్స్ అనే స్వచ్చంద సంస్థ .. అందరి సహకారంతో స్వల్పంగా అభివృద్ధి చేసింది. అబ్దుల్ కలాం పేరు పెట్టి.. వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేశారు. ఇటీవల G20 సదస్సు సుందరీకరణలో కేంద్ర నిధులు పెట్టి అభివృద్ధి చేశారు. పనిలో పనిగా కలాం పేరు తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టారు.
ఇలాంటి దారుణం ఏదో చేయబోతున్నారని తెలిసి వైజాగ్ వాలంటీర్స్ సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శాశ్వతంగా అధికారికంగా కలాం పేరు పెట్టాలని ఆన్ క్యాంపైన్ చేస్తున్నారు. కానీ వీరిని ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఓ సారి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టారు. ఆ సమయంలో దుమారం రేగడంతో.. సీఎం జగన్ సీరియస్ అయ్యారని కబుర్లు చెప్పి.. మళ్లీ కలాం పేరు పెట్టారు. మరి ఈ బీచ్ వ్యూ పాయింట్ విషయంలో ఏం చేస్తారో ?