సీఎం జగన్ తనకు టిక్కెట్ ఇవ్వనంటున్నారని అంబటి రాంబాబు డైరక్ట్ గా చెప్పుకున్నారు … అంబటి రాంబాబు కాకపోతే అంబటి రాయుడు ఉన్నారని అప్పట్లో రాంబాబుకు అర్థం కాలేదమో కానీ ఇప్పుడు మాత్రం క్లారిటీ వస్తోంది. అంబటి రాయుడు క్రికెట్ ఇన్నింగ్స్ లో ఇక చేయగలిగిందేమీ లేదని డిసైడపోయారు. వచ్చే సీజన్ నుంచి తనను ఏ టీమూ తీసుకోదని..ఉన్న టీమ్ కూడా వదిలించుకుటుందని క్లారిటీ రావడంతో పొలిటికల్ ఇన్నింగ్స్ పై దృష్టి పెట్టారు. గత వారమే ఆయన ఓ ఇంగ్లిష్ మీడియాకు కొన్ని పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని.. ఏ పార్టీతో అనేది తర్వాత చెబుతానని చెప్పుకొచ్చారు.
తన చర్చలు వైసీపీతో ఆగిపోయాయనని ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. జరుగుతున్న ఐపీ ఎల్ గురించి కాకుండా…. శ్రీకాకుళంలో కట్టేస్తానని జగన్ శంకుస్థాపన చేసిన మూలపేట పోర్టు దగ్గర మాట్లాడిన మాటల గురించి ట్వీట్ చేశారు. అద్భుతంగా ప్రసంగించారు సార్.. రాష్ట్రంలో అందరూ మీపై గొప్ప నమ్మకంతో ఉన్నారు సార్ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి కూడా ఆలోచిస్తారేమో అనంతగా నెటిజన్లు రియాక్టవుతున్నారు. రాష్ట్రంలో అందరి గురించి ఎలా చెబుతావు.. నీకు నమ్మకం ఉంటే నీ గురించి చెప్పుకోవాలంటున్న నెటిజన్ల ప్రశ్నలకు రాయుడు వద్ద ఆన్సర్ లేదు.
వైసీపీకి ఇప్పుడు అభ్యర్థులు కావాలి . ఉన్న వారిపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే జగన్ అసహనంతో ఉన్నారు. అంబటి రాయుడు లాంటి వారు అయితే ఉపయోగపడతారని అనుకుంటూ ఉండవచ్చు. హైదరాబాద్ లో స్థిరపడిన అంబటి రాయుడు ఫ్యామిలీ తాము పొన్నూరుకు చెందిన వారమని ప్రచారం చేసుకుంటోంది. అంటే పొన్నూరు టిక్కెట్ లేదా సత్తెనపల్లి టికెట్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. అయితే అంబటి రాయుడి మనస్థత్వం తెలిసిన వారు.. వైసీపీలో పరిస్థితుల్ని అంచనా వేసిన వారు.. ఆయన చేరినంత వేగంగానే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని సెటైర్లు వేస్తున్నారు.