అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూమూర్తి జస్టిస్ సురేందర్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. మధ్యాహ్నం రెండు తర్వాత ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టింది. అవినాష్ రెడ్డి తరపున ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన లాయర్‌గా … నిమిషాల లెక్కన చార్జ్ చేసే ముకుల్ రోహత్గీ వాదించారు. వైఎస్ సునీత తరపున సిద్ధార్థ లూధ్రా వాదించారు. హైకోర్టు ఉత్తర్వుల విషయంలో సీజేఐ ధర్మాసనం ప్రతీ పాయింట్‌ను తప్పు పట్టింది. దీన్ని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కూడా ఏమనలేకపోయారు.
హైకోర్టు ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్నారని వాదించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వాదన సరిపోలేదు. చివరికి పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని.. సీజేఐ ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే మామూలు పరిస్థితుల్లో అయితే పిటిషన్ విత్ డ్రాకు అంగీకరించేవారమని కానీ ఇక్కడ హైకోర్టు అసాధారణ ఉత్తర్వుల ఇచ్చిందని.. ఈ విషయంలో తాము అంగీకరించలేమని స్పష్టం చేశారు. అయితే వేరే న్యాయమూర్తి ముందు పెట్టాలనే ప్రతిపాదనను అవినాష్ రెడ్డి తరపులాయర్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు పెట్టారు. అవసరం లేదని స్పష్టం చేసిన సీజేఐ ధర్మాసనం తీర్పు చెప్పింది. హైకోర్టుఉత్తర్వులను కొట్టి వేస్తూ.. వివేకా హత్య కేసు విచారణకు సీబీఐకి గడువును జూన్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డగోలు ప్రయత్నాలను లాయర్లు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులో ఇంకా పిటిషన్లు విచారణలో ఉన్నాయి కాబట్టి.. అవి విచారణపూర్తయ్యే వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలాంటి ఊరట లభించనందున సీబీఐ ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే.. అప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగలరు. మరో వైపు పులివెందులలో పెద్దఎత్తున అదనపు బలగాలను మోహరింపచేశారు.
హైకోర్టు ఆదేశాలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించడం ద్వారా. .. తీర్పు చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలు ఈ కేసులో ముందస్తు బెయిల్ దానికే చాన్స్ లేదని ఓ మాదిరి న్యాయరంగంలో అనుభవంఉన్న వారు కూడా విశ్లేషించారు. అయితే జస్టిస్ సురేందర్ మాత్రం.. ముందస్తు బెయిల్ ఇవ్వడమే కాకుండా దర్యాప్తును నియంత్రించేలా ఉత్తర్వులు ఇచ్చారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నేరుగా అలాంటి వ్యాఖ్యలే చేసింది.