వారం క్రితం విడుదలై విరూపాక్ష.. బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. సాధారణంగా ఎలాంటి సినిమా అయినా.. ఓ వారం తరవాత దూకుడు తగ్గుతుంది. కొత్త సినిమాలొస్తాయి. వాటికి జనం ఎగబడతారు. దాంతో.. సినిమా హిట్టయినా, ఓ వారంలో థియేటర్లు బోసిబోతాయి. అయితే.. ఈవారం కూడా విరూపాక్ష విజృంభించడానికి అవకాశం కల్పించింది.. ఏజెంట్.
ఈ శుక్రవారం ఏజెంట్ విడుదలై, తొలి షోకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకొంది. తొలి రోజు ఏజెంట్ వసూళ్లు దారుణంగా ఉన్నాయి. రెండో రోజు సంగతి చెప్పాల్సిన పనిలేదు. దాంతో.. ఏజెంట్ వైపు చూడ్డానికి కూడా ప్రేక్షకుడు సాహసించడం లేదు. ఇక వాళ్లకు ఉన్న ఏకైక ఆప్షన్.. విరూపాక్ష ఒక్కటే. అందుకే ఈ వారం కూడా విరూపాక్ష మంచి వసూళ్లే రాబట్టుకొంటోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి రూ.70 కోట్లు వచ్చాయి. ఏజెంట్ పుణ్యమా అని మరో పది కోట్లు రాబట్టే ఛాన్స్ దక్కింది. ఏజెంట్ ఎప్పుడైతే ఫ్లాప్ అయ్యిందో.. అప్పటి నుంచి విరూపాక్ష ప్రమోషన్లు మరింత జోరందుకొన్నాయి. పేపర్లో యాడ్లు, సక్సెస్ మీట్లు.. అంటూ వారం తరవాత కూడా హడావుడి చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం విడుదలైన ఏజెంట్ మాత్రం ఎవరికీ కనిపించకుండా గప్ చుప్ అయిపోయాడు.