జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సారి ఆయన తనకు రాజకీయాలపై పూర్తి క్లారిటీ ఉందన్నట్లుగా మాట్లాడతారు. తర్వాత రోజు మరో రకంగా మాట్లాడతారు. దీంతో ఆయన ఒక్క రోజు కూడా .. ఒకే మాట మీద ఉండలేరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఎందుకు చేస్తన్నారో కానీ ప్రజల్లో కూడా పవన్ కు క్లారిటీ లేదా లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నా.. కన్ఫ్యూజ్ చేయాలనుకుంటన్నారా అన్న అనుమానికి గురవుతున్నారు. రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా చేయాలో .. ఎలాంటి ప్రకటనలు చేయాలో ఆయనకు ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదని పొత్తలపై వరుసగా రెండు రోజుల్లో ఆయన చేసిన ప్రకటనల్లోని వైరుధ్యమే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బలం గుర్తిస్తే ఈ మాటలెందుకు?
రాజకీయాల్లో అటూ ఇటూ ఊగిసలాడుతూంటే.. చులకన అయిపోతారు. అలాంటి చులకన పవన్ కల్యాణ్ ప్రతీ సారి అవుతూనే ఉన్నారు కానీ తీరు మార్చుకోవడం లేదు. రాజకీయాల్లో ఆయన బలం ఎంత అనేది ఆయనకు అంచనా ఉంది. ఆ విషయం స్పష్టంగా చెప్పారు. కానీ తర్వాతి రోజే తన సోదరుడు నాగబాబు తరహాలో ముఫ్పైశాతం ఓటింగ్ దగ్గరకు వెళ్లారు. పవన్ తీరు వల్ల అసలు రాజకీయంగానే జనసేన లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జన సైనికుల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతోంది. పవన్ ఇలా పొత్తులు.. సీఎం సీటు.. పోటీ చేసే స్థానాలు ఇతర అంశాలపై క్యాడర్ ను గందరగోళం గురి చేయడం ఇదే మొదటి సారి కాదు. ఆయన రాజకీయం అలాగే ఉంది. ఎవరికీ క్లారిటీ ఉండదు. చివరికి ఆయనేక ఉండరు. ఎంతో క్లారిటీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారనుకున్న తర్వాతి రోజే ఆయన మాట మార్చేస్తున్నారు.
పవన్ ను ట్రోల్ చేస్తున్న ప్రో వైసీపీ జనసైనిక్స్
జనసేన పార్టీలో .. పవనన్నకు ప్రాణమిస్తాం.. జగనన్నకు ఓటు వేస్తాం అనే బ్యాచ్ ఒకటి ఉందనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిలో ఎప్పుడూ బయటకురాని ఓ మేధావి బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. టీడీపీ నేతను సీఎంను చేయడానికి పొత్తులు పెట్టుకోవట్లేదు అని పవన్ చేసిన ప్రకటన ముందూ .. వెనుకా తీసుకోకుండా ఆ ఒక్క పాయింట్ తీసుకుని వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈయనకు చేగొండి హరిరామజోగయ్య తోడయ్యారు. ఇలాంటి వారు పవన్ కల్యాణ్ ఆలోచనల్ని పట్టుకోకుండా.. జనసేనకు ఏది మంచో చూడకుండా.. సోషల్ మీడియాలో సైనికుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ పవన్ వారిని కంట్రోల్ చేయడం లేదు. ఫితంగా పవన్ ను వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు.
బీజేపీ పొత్తులపై తేల్చడానికి పవన్ ఎవరు ?
బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. ఆ పార్టీతో కలిసి పని చేయడం లేదు. ఈ అంశంపై బీజేపీ ఏమీ అభ్యంతర పెట్టడం లేదు. ఆయన రాజకీయాలు ఆయన చేసుకుంటారని చెబుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ పొత్తుల గురించి ఎలా ప్రకటనలు చేస్తారు ? టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే వైసీపీపై గెలుస్తాయని ఆయన బహిరంగ ప్రకటన చేశారు. అసలు బీజేపీ పొత్తులపై హైకమాండ్ ఇంకా ఎలాంటి చర్చలు కూడా ప్రారంభించలేదుజనసేన కలిసి వస్తే సరే లేకపోతే మరో కూటమి గురించి ఆలోచించడం లేదు. మరి పవన్ ఎందుకు బీజేపీ ని పొత్తుల రాజకీయాల్లోకి లాగుతున్నారు ? అసలు అసలు సంబంధం ఉందా? రాజకీయాల్లో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తారేమో కానీ ఇలా సంబంధం లేని సంబంధాలు కలిపే ప్రయత్నం చేయడం అవగాహనా లోపమే. దీన్నే పవన్ మార్చుకోలేకపోతున్నారు.