ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల భయం ఎక్కువగానే పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉండి ఎన్నికలు ఎలా నిర్వహించాలో కూడా స్పష్టత ఉన్న ప్రభత్వానికి.. మిగిలిన మున్సిపాలిటీలు.. రాజమండ్రి కార్పొరేషన్ కు ఎన్నికలు జరిపించేందుకు వెనుకడుగు వేస్తోంది. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపుగా ఎనిమిది మున్సిపాలిటీలతో పాటు అనేక చోట్ల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిపై దృష్టి పెట్టలేదు. ఎన్నికలపై ప్రభుత్వం ఆసక్తిగా లేకపోవడమే దీనికి కారణం.
ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆరు నెలలు పొగిడిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే. ఆ తర్వాత ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి అసలు ఎన్నికలు పెట్టరు. ఇప్పటికిప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అదే ప్రజాభిప్రాయం అన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యూయేట్ ఓటర్లు కొట్టిన దెబ్బతో జగన్ సర్కార్ కు మైండ్ బ్లాంక్ అయింది.ఇప్పటికిప్పుడు అలాంటి ఓటింగ్ జరగాలని కోరుకోవడం లేదు.
అయితే మిగిలిన వాటికి ఎన్నికలు పెట్టకపోవడాన్ని విపక్షాలు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందన్న కారణంగానే వెనుకడుగు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం అనుకుంటే అనుకున్నారు.. ఓటింగ్ కు మాత్రం వెళ్లకూడదని డిసైయింది.