ప్రభుత్వంతో సంబంధం లేకుండా టైర్ 2 సిటీల్లో తమ ఆఫీసును ప్రారంభించాలని ఇన్ఫోసిస్ చాలా కాలం కిందట అనుకుంది. అందులో విశాఖపట్నం ఉంది. ఆ సంస్థ సొంతంగా ఆఫీస్ కూడా చూసుకుంది. అయితే ఎప్పుడు ఈ విషయం బయటకు తెలిసిందో అప్పుడు ప్రభుత్వ జోక్యం ప్రారంభమయింది. ఇప్పటి వరకూ ఇన్ఫోసిస్ ప్రారంభం కాలేదు. ఏడాదిన్నర నుంచి అదిగో ఇదిగో అంటున్న ఇన్ఫోసిస్ క్యాంపస్ మే31న విశాఖలో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన భవనం ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
ఓ భవనంలో ఓ సైడ్ నాలుగు ఫ్లోర్లను అదెద్కు తీసుకుని ఇన్ఫోసిస్ అనే బోర్డు పెట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అమ్మే బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో అంత కంటే పెద్ద బిల్డింగ్లలో ఉంటాయి. మరి ఇన్ఫోసిస్ ఎందుకు ఇంత చిన్న స్పేస్లో ఆఫీసు పెడుతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇన్ఫోసిస్ కు పెట్టడం ఇష్టం లేదని ప్రభుత్వ జోక్యం మితిమీరిపోవడం వల్ల వెనక్కి తగ్గిందని.. కానీ పూర్తిగా వెనక్కి పోలేక.. ఆఫీసు పెట్టాం అనిపించడానికి కొద్దిగా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారని అంటున్నారు.
ఈ క్యాంపస్ లో వెయ్యి మంది పని చేస్తారని చెబుతున్నారు కానీ గట్టిగా షిఫ్టుకు ..వంద మంది పని చేస్తేనే ఫుల్ ఆక్యుపెన్సీతో నడిచేలా ఆఫీసు ఉంది. ఇన్ఫోసిస్ క్యాంపస్లు ఎక్కడ చూసినా లగ్జరీగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటాయి. విశాఖలోమాత్రం ఏదో లోకల్ సాఫ్ట్ వేర్ కంపెనీ పెడుతున్నట్లుగా పెడుతున్నారు. దీనికి కారణాలేమిటన్నది కంపెనీ చెప్పదు కానీ.. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అత్యంత భారీ క్యాంపస్ గా విస్తరిస్తారని మనం ఆశలు పెట్టుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు విశాఖకు ఓ పరిశ్రమ రావడం ముఖ్యం.