పైకి చెప్పింది రాష్ట్రం కోసం యాగం అని అయినా అసలు చేస్తోంది మాత్రం జగన్ కోసమని చెప్పాల్సిన పని లేదు. విజయవాడలో కనీసం రూ. పది కోట్ల మేర ఆలయాల సొమ్ముతో నిర్వహిస్తున్న యాగానికి జనం కూడా రావడం లేదు. జగన్ మళ్లీ సీఎం కావాలని నిర్వహిస్తున్న యాగమని విస్తృతంగా ప్రచారం జరుగుతూండటంతో ఎవరూ వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. జగన్ లేక పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో రెండు రోజుల నుంచి బస్సుల్ని పెట్టి తరలిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమానిికి సీఎం జగన్ వస్తూండటంతో.. బహిరంగసభలకు తరలించినట్లుగా టార్గెట్లను పెట్టి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కేసీఆర్ ఎక్కడైనా యాగం నిర్వహిస్తే.. తండోపతండాలుగా జనం తరలి వస్తారు. ఆయన ఏం చేసినా ఆ యాగంలో పవిత్రత ఉందని భావిస్తారు. కానీ క్రైస్తవుడు అయిన జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం.. రాజకీయాల కోసం చేసే యాగాలను నమ్మడానికి ప్రజలుల సిద్ధంగా లేరు. అదీ కూడా భక్తుల సొమ్ముతో నిర్వహిస్తూండటంతో వారిలో అసహనం కనిపిస్తోంది. వందల కోట్ల ప్రజాధనాన్ని సొంత డబ్బులా ఖర్చు పెట్టుకుంటున్న సీఎం జగన్ తీరుపై ఇప్పటికే మధ్య తరగతి ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
ఈ యాగం వల్ల జగన్ కు ఏమైనా లాభం ఉంటుందో లేదో కానీ.. స్వామి స్వరూపనంద మాత్రం అసంతృప్తికి గురవుతున్నారు. తన ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహించడం లేదు…పైగా తన మాటలను కూడా పట్టించుకోవడం లేదని..సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఫీలవుతున్నారు. అందుకే దేవాదాయశాఖపై ఆయన ఉగ్రంగా ఉన్నారని.. కొంత మంది అధికారుల్ని తీసేయాలని పట్టుబడుతున్నారని అంటున్నారు. ఈ యాగం వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వంలోనూ చర్చనీయాంశంగా మారింది.