హీరో శర్వానంద్ తన సింగిల్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇదివరకే వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు వివాహ ముహూర్తం ఖరారైయింది.
జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్-రక్షితల వివాహం జరగనుంది. జూన్ 2వ తేదీన మెహందీ వేడుకను నిర్వహించనున్నారు. శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌రెడ్డి. ఆయన హైకోర్టు లాయర్. తల్లి సుధారెడ్డి.