బాలకృష్ణ తదుపరి సినిమా ఎవరితో? అనే ప్రశ్న వస్తే అందరి గొంతులోంచీ బోయపాటి శ్రీను పేరే బయటకు వచ్చేది. ఎందుకంటే.. 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మంచి పొలిటికల్ సినిమా తీస్తే.. బాలయ్యకూ, టీడీపీ పార్టీకీ ప్లస్ అవుతుంది. ఈనెల 10న బాలయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంతా ఫిక్సయిపోయారు.
కానీ సమీకరణాలు మారిపోయాయి. బాలయ్య తదుపరి సినిమా బోయపాటితో కాదు. బాబి లైన్లోకి వచ్చాడు. బాలయ్య 109వ సినిమా బాబీతోనే. బోయపాటి సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. దానికీ బలమైన కారణాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యే సరికి బాలయ్యకు టైమ్ పడుతుంది. ఈలోగా బోయపాటి – రామ్ సినిమా కూడా ఫినిష్ అవ్వాలి. అప్పుడే ఈ కాంబో కుదురుతుంది. ఈలోగా 2024 ఎన్నికలు దగ్గర పడిపోతాయి. హడావుడిగా పూర్తి చేసి, సినిమా వదిలితే మొదటికే మోసం వస్తుంది. పైగా అసలు టార్గెట్ ఎన్నికలే. అది దాటితే వేడి చల్లారిపోతుంది. అందుకే.. ఇంత హడావుడిగా ఈ సినిమాని మొదలెట్టాల్సిన అవసరం లేదని, తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. బోయపాటితో బాలయ్య సినిమా ఉంటుంది. కానీ అది 2024 ఎన్నికల తరవాతే! బాలయ్య పుట్టిన రోజుకి మొదలయ్యేది బాబి సినిమానే. ఇది మాత్రం ఫిక్స్.