ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేని ప్రాంతం లేదు. సోషల్ మీడియా పై అవగాహన ఉన్న వారు .. . కోతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇబ్బంది పెడతారని చూసుకోకుండా… ఇంతసేపు కరెంట్ పోయింది.. అని ప్రభుత్వంపై బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. దాదాపుగా ప్రతీ చోటా నాలుగైదు గంటల కరెంట్ పోతోంది. ఈ బాధలు ఇలా పడుతూంటే..కరెంట్ బిల్లులను ప్రభుత్వం బాదేయడం చూసి.. జనం అవాక్కవుతున్నారు. అసలు చార్జీల కన్నా రెట్టింపు బిల్లు చేతికిస్తున్నారు. కట్టకపోతే కరెంట్ కనెక్షన్ పీకేస్తున్నారు.
అధికారికంగా కరెంట్ చార్జీలు ఎన్ని సార్లు పెంచారో లెక్కే లేదు. అయితే ప్రభుత్వం చేసిన అవినీతి .. డిస్కంలను దోచుకున్న దానికీ.. ప్రజల దగ్గర బాదేస్తూండటమే అసలు విషాదం. ఇంధర సర్దుబాటు పేరుతో ఎఫ్‌పీసీసీఏ చార్జీలు అంటూ ఓ సారి వడ్డించారు. రెండో సారి కూడా వడ్డించారు. అంటే కరెంట్ బిల్లులు రెండు ఇందన సర్దుబాటు చార్జీలు కనిపిస్తున్నాయి. దీనికి ట్రూ అప్ చార్జీలు అదనం. ఇవన్నీ ఎందుకు అంటే బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరకు కరెంట్ కొనుగోలు చేసినందుకు. సర్ ప్లస్ విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలు విధానాలతో నేల నాకించేసి … బయట నుంచి పెద్ద ఎత్తున అత్యధిక రేట్లను విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై నెట్టేశారు.
అదే సమయంలో డిస్కంలను దోపిడీ కేంద్రాలుగా మార్చుకున్నారు. ఒక్క యూనిట్ కరెంట్ ఇవ్వని హిందూజాకు 1250 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. బినామీ కంపెనీ అయిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ నుంచి వేల కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్లు అవసరం లేకపోయినా కొనిపడేశారు. ఇవన్నీ ప్రజలమీదే రద్దారు.
ఏపీ కరెంట్ బిల్లులో వాడుకున్న కరెంట్ కన్నా ఇతర చార్జీలు అదనం… ఒక్క బిల్లులో అసలు కరెంట్ వాడుకున్నదానితో పాటు… సర్ చార్జ్, ఫిక్స్డ్ చార్జెస్, కస్టమర్ చార్జ, ఒక ఎఫ్‌పీపీసీఏ, రెండో ఎఫ్‌పీపీసీఏ, ట్రూ అప్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, అడ్జస్ట్ మెంట్లు ఇలా అన్ని రకాలుగా చార్జీలు బాదేస్తున్నారు. మొత్తంగా కరెంట్ బిల్లు మూడు వందలు అయితే.. చేతికి ఇచ్చే బిల్లు ఆరు వందలు. ఈ బిల్లులు చూసి ప్రజలు షాక్ కు గురవుతున్నారు. కొసమెరుపేమిటంటే.. రేపోమాపో స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీ .. వాటా ఈ బిల్లుల్లో చేరబోతోంది.