ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండి పడ్డారు. బీజేపీ తొమ్మిదేల్ల పాలనా విజయాలపై శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. మోదీ విజయాల గురించిచెప్పిన తర్వాత.. ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. దేశంలోనే మోస్ట్ అవినీతి పార్టి వైసీపి పార్టీ తేల్చిచెప్పారు. ఏపీలో జరగని అవినీతే లేదన్నారు. మైనింగ్ స్కాం, లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, ఎడ్యుకేషన్ స్కాం వైసీపి హయాంలోనే జరుగుతుందోందన్నారు. కేంద్రం ప్రభుత్వం నిజమైన అభివృద్ధి కోసం పని చేస్తుంది. ఇటువంటి అవినీతి ప్రభుత్వంను ఎక్కడా చూడలేదన్నారు.
నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఎక్కడ కనిపించలేదన్నారు. దేశంలో శాంతి భధ్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపి మాత్రమేనని.. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంను ఎక్కడ చూడలేదన్నారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదని ప్రకటించారు. వైసీపీ చేతకాని తనం.. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్లనే ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. జేపీ నడ్డా ప్రసంగంపై రాజకీయ పార్టీలన్నీ చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా ఏ పార్టీని విమర్శిస్తారు అన్నదానిపై ఎక్కువ ఆసక్తి చూపించారు. వైసీపీని దారుణంగా విమర్శించడంతో.. వైసీపీకి దగ్గరయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జగన్ నిర్వహించిన భేటీలో.. ఎన్డీఏలో చేరుతామనిచెప్పినట్లుగాప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జగన్ చేరుతామన్నా చేర్పించుకునే పరిస్థితిలో బీజేపీ లేదని.. నడ్డా స్పీచ్తో తేలిపోయిందని అంటున్నారు. అమిత్ షా పర్యటన ఆదివారం విశాఖలో ఉంది. ఆయన కూడా వైసీపీపై ఎటాక్ చేస్తే.. ఏపీలో బీజేపీ రాజకీయ పయనంపై ఓ క్లారిటీ వచ్చిటన్లేనని భావించవచ్చు.