‘ఊర్వశివో.. రాక్షసివో’ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకొన్నాడు అల్లు శిరీష్. ఆ సినిమా కాస్త డీసెంట్‌గానే ఆడింది. ఆ తరవాత ‘బడ్డీ’ అనే ఓ సినిమాని గప్ చుప్‌గా పూర్తి చేశాడు. శ్యామ్ ఆంటోన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల ఫస్ట్ గ్లిమ్స్ కూడా విడుదలైంది. ఆర్య నటించిన తమిళ చిత్రం ‘టెడ్డీ’ పోలికలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ఆర్య నటించిన ఆ సినిమా తెలుగులో డబ్ అయ్యింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో ఉంది. దానికి ఇది రీమేక్ అని కూడా చెప్పుకొంటున్నారు. నిజానికి ఇది రీమేక్ కాదు. సీక్వెల్ లాంటి కథ. `టెడ్డీ`కి కొనసాగింపుగా `బడ్డీ` వస్తోంది.
నిజానికి ఈ కథ ముందు సందీప్ కిషన్ దగ్గరకు వెళ్లింది. తనతో కొన్ని సీన్లు కూడా తెరకెక్కించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సందీప్ బయటకు వెళ్లిపోయాడు. అలా అల్లు శిరీష్ దగ్గరకి ఈ సినిమా వెళ్లింది. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.