జర్నలిస్టుల సంక్షేమంపై ఏపీలో ఇప్పుడు వార్ నడుస్తోంది. ఇతర జర్నలిస్టులు.. వైసీపీ జర్నలిస్టుల మధ్య వార్ ప్రారంభమయింది. ఈ వార్ ను.. టీవీలకు కూడా ఎక్కించేశారు.. వైసీపీ సలహాదారులు.
నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని జర్నలిస్టు సంఘాలు సమావేశం పెట్టుకున్నాయి. ప్రభుత్వం ఎలా వేధించిందో చెప్పుకున్నారు. ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా వేధింపులకు గురయ్యారో.. జర్నలిస్టులు కూడా అలాగే. సంక్షేమం పేరుతో కథలు చెప్పి.. ఉన్న గోచీ ఊడగొట్టే ప్రయత్నం చేశారని ఆవేదన చెందారు. వీరు ఇలా మాట్లాడుకున్నారని.. తెలిసిన వెంటనే… దేవులపల్లి అమర్, కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్టుపెద్ద మనుషులు తెరపైకి వచ్చారు.
తెలంగాణకు చెందిన దేవులపల్లి అమర్ … ఏపీకి రాకుండానే ఏపీ ప్రజల సొమ్మును సలహాదారు పాత్రలో ఉండి నొక్కేస్తున్నారు. ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి.. జర్నలిస్టు సంఘాలపై విరుచుుపడ్డారు. అనేక ఆరోపణలు కూడా చేశారు. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు కూడా అంతే. ఆయన ఏకంగా టీవీ స్క్రీమ్ మీదకు వచ్చి జర్నలిస్టు సంఘాల నేతలకు ప్రవచనాలు చెప్పారు. ఇంతకూ వాళ్లు చెప్పిందేమిటంటే… జర్నలిస్టు సంఘాల మీద ఆరోపణలు చేయడం.. బురద చల్లడం. కానీ అసలు నిజంగానే జర్నలిస్టుకు జగన్ ఏం చేశారో చెప్పలేదు.
బహుశా వారి ఉద్దేశంలో తాము జర్నలిస్టులమే కదా.. జగన్ తమకు అప్పనంగా.. నెలకు ఐదారు లక్షలు ఇస్తున్నారు కదా.. ఇది జర్నలిస్టు సంక్షేమం కాదా అని కావొచ్చని ఇతర జర్నలిస్టులు అనుకుంటున్నారు.. జర్నలిజాన్ని నమ్ముకునే వాళ్లకు.. అమ్ముకునే వాళ్లకూ తెడా ఉంటుదని .. నమ్ముకున్న వాళ్ల సంక్షేమం గురించి జర్నలిస్టు సంఘాలు పోరాడుతున్నాయని.. అమ్ముకున్న జర్నలిస్టులు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని వారిపై విమర్శలు వస్తున్నాయి. అయితే అప్పనంగా ప్రజల సొమ్ము దిగమింగడానికి అలవాటు చేసుకున్న వారికి ఇవేమీ పెద్ద మాటలుగా అనిపించవు. సిగ్గు విడిచేసిన జర్నలిస్టులు మరి. !