టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తూ సీఎం జగన్ చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. నాలుగేళ్లలో తానే మొత్తం కట్టించానని.. పేదలకు ఇస్తున్నానని చెబుతున్నారు. ఆ ఇళ్లు ఎవరు కట్టించారో కళ్ల ముందే ఉంది. గుడివాడ జనాలకూ తెలుసు. తానే కట్టించానని జగన్ చెబితే… వారు నమ్ముతారో లేదో తర్వాత సంగతి … అంత బిల్డర్ అయితే… నాలుగున్నరేళ్లు అవుతోంది. .. ఒక్క సెంట్ స్థలం ఇల్లు కూడా ఎందుకు ప్రారంభించడం లేదనేది ఇక్కడ అందరికీ వస్తున్న .. వచ్చే సందేహం.
సీఎం జగన్ తాను ఇళ్లు కాదు కాలనీలు నిర్మిస్తున్నానంటూ ప్రకటించేవారు. అందుకు ఆయన చేసిందేమిటంటే.. దళితుల దగ్గర భూములు లాక్కుని.. ఇతర చోట్ల అతి తక్కువ రేటు ఉన్న స్థలాలను పార్టీ నేతల దగ్గర ఎక్కువకు కొని దోపీడీ చేయడం. ఆ తర్వాత ఇళ్లు కట్టాలంటే మాత్రం చేతులు రావడం లేదు. డబ్బులు ఉండాలి కదా. కేంద్రం ఇచ్చే లక్షన్నరతోనే ఇల్లు కట్టుకోవాలని… సెంటు స్థలం పది లక్షలంటూ.. .. పేదల్ని అప్పుల పాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ రోజుల్లో ఓ మాదిరి శ్లాబ్ ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఐదారు లక్షలు అవుతుంది. పేదలు అంత మొత్తం ఎక్కడ పెట్టుకుంటారు ?
ఏపీ ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు పైసా పెట్టకుండా… ఇళ్లు ఎలా నిర్మాణం అవుతాయి. ముఫ్పై లక్షల ఇళ్లంటూ ఉదరగొడుతున్నారు. కానీ ఇప్పటికి పది వేల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. . పూర్తయిన చోట మౌలిక సదుపాయాలు ఉండవు. అందుకే జగన్ ప్రారంభిచలేకపోతున్నారు. నిజానికి పేదలు ఆ ఇళ్లు కట్టుకున్నా… ఎందుకూ పనికి రావు. వృధాపోవాల్సిందే. ఆ విషయం వారికీ తెలుసు. అందుకే… జగన్ ఇళ్లు.. ఆయన మాటలపై పేదల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.