డ్రగ్స్ అనే పేరు వస్తే చాలు… టాలీవుడ్ మీద లీకుల దండయాత్ర ప్రారంభించేస్తాయి… ముగ్గురు హీరోయిన్లు.. ఆరుగురు హీరోలు.. మరో క్యారెక్టర్ ఆరిస్టులు అంటూ.. పోలీసులు మీడియాకు లీక్ చేస్తారో లేకపోతే మీడియా వాళ్లే కల్పించుని రాస్తారో కానీ… ఇష్టారీతిన విరుచుకుపడతారు. ఇప్పుడు కూడా అదే సినిమా ప్రారంభమయింది. కబాలి సినిమాను తెలుగులో విడుదల చేసి నిర్మాత అనే పేరు వేసుకున్న కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో పోలీసులు పట్టుకున్నారు.
ఆ కేపీ చౌదరి విలాస పురుషుడు. పార్టీలకు వెళ్లడం.. పార్టీలు ఇవ్వడం కామన్. ఆ పార్టీలకు బోలెడంత మంది వస్తారు. వాళ్లు ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ లో నుంచి బయటకు వచ్చాయి. పోలీసులే లీక్ చేసి ఉంటారు. ఆ ఫోటోలను బట్టి కథలు అల్లడం ప్రారంభించారు. టాలీవుడ మొత్తానికి ఆయన డ్రగ్స్ సప్లయర్ అని.. నలుగురు హీరోయిన్లనీ కథలు చెప్పడం ప్రారంభిచారు. ఇలాంటివి టీఆర్పీ రేటింగ్లు తెస్తాయని టీవీ చానళ్ల కు బాగా తెలుసు. అందుకే రెచ్చిపోతూంటారు.
నిజానికి ఎప్పుడు డ్రగ్స్ పట్టుబడినా సినిమా వాళ్లనే టార్గెట్ చేస్తారు. వారిపైనే లీకులొస్తాయి. కానీ ఇప్పటి వరకూ ఒక్క కేసులోనూ సినిమా వాళ్లు నిందితులు కాలేదు. కానీ ఇలా ఎవరు పట్టుబడినా… బాధితులుగా సినిమా వాళ్లే నిలుస్తున్నారు. నిజంగా తప్పు చేసిఉంటే.. చర్యలు తీసుకుంటే తప్పు లేదు కానీ.. మొత్తం టాలీవుడ్ పై నిందలేసి.. లాభం చూసుకుంటే ఎలా అనే ఆవేదన ఎక్కువ మందిలో కనిపిస్తోంది.