మాజీ మంత్రి మేకతోటి సుచరిత టీడీపీలో చేరుతారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఆమె భర్త.. టీడీపీ నేతలతో టచ్ లోకి వచ్చారని బాపట్ల ఎంపీ సీటు అడుగుతున్నారని బయటకు తెలిసింది. చర్చలు ఎక్కడి వరకూ వచ్చాయో తెలియదు కానీ.. నా భర్త పార్టీ మారితే నేను కూడా ఆయన వెంటనే పోతానని.. సుచరిత ప్రకటించడం సంచలనం అయింది. ఈ పరిణామాలు వైసీపీలో ఎంత అలజడి రేపాయో కానీ.. టీడీపీలో మాత్రం .. ఇబ్బందికరంగా మారాయి..
వైసీపీలో పదవులు అనుభవించి వచ్చి .. టీడీపీలో టిక్కెట్లు తీసుకుంటారా అన్న అసంతృప్తి కనిపించింది. అయితే టీడీపీ హైకమాండ్ కన్ఫర్మ్ చేయలేదు. ఎన్నికల సమయానికి ఎక్కడ దిగబడతారో అని టీడీపీ కార్యకర్తలు టెన్షన్ లో ఉన్నారు. హఠాత్తుగా సుచరిత భర్తకు .. ఓ పదవిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దయాసాగర్ కు. మచిలీపట్నం పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ పోస్టు ఇచ్చారు. దీంతో సుచరిత ఇక వైసీపీలోనే ఉండటం ఖాయమైపోయింది.
ఈ నియామకం వైసీపీలో అసంతృప్తిని చల్లార్చడానికి చేసినా.. టీడీపీకి మాత్రం ఓ సమస్య తీరిపోయిందన్న అభిప్రాయంక్యాడర్ లో వినిపిస్తోంది. సుచరిత హోంమంత్రిగా ఉన్నప్పుడు … గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై జరిగిన వేధింపులపై అన్నీ ఇన్నీ కావు. అవన్నీ మర్చిపోయి.. వైసీపీని మోరల్ గా దె బ్బతీయడానికి.. ఆమెను పార్టీలో చేర్చుకుంటే ఇబ్బంది అయ్యేదని.. ఇప్పుడా సమస్యను జగనే పరిష్కరించారని గుంటూరు టీడీపీ నేతలు సంతృప్తి పడుతున్నారు.