అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు సీబీఐకి, అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. గత విచారణలో నోటీసులు జారీ చేయడానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు. ఈ కారణంగా వెకేషన్ బెంచ అత్యవసర పిటిషన్లను విచారణ జరుపుతోంది. వెకేషన్ బెంచ్ ముందు సీనియర్ లాయర్లు వాదనలు వినిపించే అవకాశం లేకపోవడంతో సునీతనే స్వయంగా వాదించుకున్నారు.
అయితే అప్పుడు విచారణను పందొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. ఈ రోజు విచరాణలో అవనాష్ రెడ్డి, సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జూలై మూడో తేదీకి వాయిదా వేసారు. అప్పటికి వేసవి సెలవులు పూర్తవుతాయి. సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గతంలో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసి ఉన్నందున… జూలై మూడో తేదీన సుప్రీంకోర్టులో జరగబోయే విచారణపై ఆసక్తి ఏర్పడనుంది. ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ మేరకు .. అవినాష్ రెడ్డి ప్రతిశనివారం సీబీఐ విచారణకు హాజరవుతున్నారు.
అరెస్ట్ తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే సీబీఐ ఇప్పటికే గుంభనంగా అరెస్ట్ చేి.. బెయిల్ ఇచ్చింది కూడా. ఇది కూడా హైకోర్టు షరతుల్లో భాగమే. మొత్తంగా సునీత ఒంటరిపోరాటం చేస్తున్నారు. ఓ వైపు బలమైన అధికార కేంద్రాన్ని .. మరో వైపు వైసీపీ పార్టీ నేతలు ఆమె వ్యక్తిత్వ హననం చేస్తూ.. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు … అన్నింటినీ ఎదుర్కొంటూ ధైర్యం కోల్పోకుండా… పోరాడుతున్నారు