తాము అధికారంలోకి రాగానే ఇళ్ల రుణాలన్నింటినీ రద్దు చేసి పడేస్తానని జగన్ పాదయాత్రలో ప్రతి వీధి.. సందు, గొందులో చెప్పారు. తీరా వచ్చాక.. 1983 నుంచి అంటే ఎన్టీఆర్ కాలంలో ఇళ్ల పథకం తీసుకు వచ్చినప్పటి నుండి బాకీలు ఉన్నాయని చెప్పి పేదలందరి దగ్గర వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇచ్చారు. పది, ఇరవై వేలు కట్టాలని వెంటబడ్డారు. ఈ మొత్తం కడితే ఇల్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని… రూ. లక్షలకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవచ్చని ఆశ పెట్టారు.
ఒక్కో నిరుపేద ఇంటికి పదిమందిని పంపి మరీ డబ్బు వసూలు చేసిన జగన్ ప్రభుత్వం
అప్పో.. సప్పో చేసి అయినా కట్టాల్సిందేనని పేదల ఇళ్ల మీదకు రుబాబుకు వెళ్లారు. ఒక్కో ఇంటిపైకి వాలంటీర్లు,సచివాలయ ఉద్యోగులు సలహా పది మంది వరకూ పంపేవారు. డబ్బులు కడితే రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని.. వాటిపై బ్యాంకులు లోన్లు ఇస్తాయని మభ్య పెట్టారు. భయపడిన వారు.. ఆశపడిన వారు అప్పులు చేసి మరీ తెచ్చి కట్టారు. కానీ ఇప్పుడు ఆ ఓటీఎస్ స్కీమ్ గురించి ఒక్కరూ మాట్లాడటం లేదు. అంటే పేదల దగ్గర నుంచి వందల కోట్లు వసూలు చేశారు.. వారు చెప్పినట్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు.
ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు కానీ మోసమే !
ఎప్పటి ప్రభుత్వాలో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు అప్పు కట్టమని వేధించినా భరించినా పేదలకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికి అందడం లేదు. అసలు ఈ ప్రక్రియే జరగడం లేదు . వార్డు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పారు. ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో డబ్బులు కట్టిన వారు తమకు రిజిస్ట్రేషన్ పత్రాలివ్వాలని తిరుగుతున్నారు. గతంలో జగన్ మీట నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కొంత మందికి రిజిస్ట్రేషన్ పత్రాలిచ్చారు. వారికి బ్యాంకులు లోన్లివ్వడం లేదు. ఆ పత్రాలు చెల్లవని చెబుతున్నారు.
నిరుపేదల్ని ఇంతలా దోచుకున్న ప్రభుత్వం ఉంందా ?
ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వారంతా నిరుపేదలే. రూ. ఇరవై వేలంటే వారికి చాలా పెద్ద మొత్తం. మామూలుగా వారు పేదలు.. కట్టలేరు అని ప్రభుత్వాలు కూడా మాఫీ జాబితాలో చేర్చేశాయి. కానీ రిజిస్ట్రేషన్లు, లోన్లు పేరుతో మభ్య పెట్టి వారిని మరింతగా అప్పుల ఊబిలోకి దింపేశారు. కానీ ఇప్పుడు .. మాత్రం పూర్తిగా మర్చిపోయారు. డబ్బులు కట్టిన వారికైనా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసివ్వాలని… బ్యాంకుల్లో లోన్లు ఇప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ పేదల్ని అప్పుల పాలు చేయాలనే పథకంలో భాగంగా ఇదంతా జరిగింది కాబట్టి చేయాల్సినదంతా చేశారు. అందుకే సైలెంట్ అయిపోయారన్న వాదన వినిపిస్తోంది