ఏపీ సీఎం జగన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసేవాళ్లు చాలా అప్ డేటెడ్ గా ఉంటారు. ఎంత అప్ డేటెడ్ అంటే.. అంతర్జాతీయ ట్రెండ్స్ ను కూడా ఇట్టే పట్టేసి జగన్ స్పీచ్‌లో ఇరికించేస్తారు. అది సాధ్యమా కాదా.. అనేది ఎవరికీ అవసరం లేదు. ఎదుకంటే చేసే వాళ్లకయితే కనీస కసరత్తు ఉంటుంది.. చేసే చాన్సే లేదు కాబట్టి .. ఉత్త ప్రకటనలకే కాబట్టి అలవోకగా అలాంటివి మాట్లాడేస్తూ ఉంటారు.
కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు ఆణిముత్యాల పేరుతో అవార్డులిచ్చే ప్రోగ్రాంను తన పేరుతోనే ఏర్పాటు చేసుకున్న జగన్ రెడ్డి.. అ కార్యక్రమంలో త్వరలోనే ఐబీ సిలబస్ తెస్తామని ప్రకటించారు. ఈ ఐబీ పేరు ఎప్పుడూ వినని చాలా మంది.. మళ్లీ ఏదో తెచ్చేశారని అనుకున్నారు. ఎందుకంటే బైజూస్ తో ఇప్పటికే పెట్టాల్సిన తిప్పలన్నీ పెడుతున్నారు. ఇక స్టేట్ బోర్డు అనేది లేకుండా మొత్తం సీబీఎస్ఈని చేసేస్తాని ఇప్పటికే ప్రకటించారు. కానీ అడుగులు ముందుకు పడటం లేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా ఐబీ కరికులం తెస్తామని ప్రకటించేశారు.
ఐబీ కరికులం అంటే.. ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ . స్విట్టర్జ్లాండ్కు చెందిన కొంత మంది టీచర్స్ తయారు చేసిన ప్రత్యేకమైన కరికులం ఇందులో ఉంటుంది. ఇదంతా ప్రాక్టికల్ విద్య. పరీక్షలు అనేవి ఉండవు. ర్యాంకులు, మార్కుల గొడవ ఉండదు. ఇది ఇండియాలో ముఖ్యంగా ఏపీలో ఎలా వర్తింప చేయగలరో.. జగన్ చెప్పాల్సి ఉంటుంది. కానీ రాసిచ్చింది చదివే ఆయనకు దీని గురించి అవగాహన ఉండే అవకాశం లేదు.
ఐబీ కరికులం కేవలం ఓ ప్రత్యేకమైన వ్యవస్థలోనే ఇముడుతాయి. గవర్మెంట్ స్కూళ్లకు అసలు సరిపడవు. అలాంటి పరిస్థితికి రావాలంటే.. దేశం.. విద్యావ్యవస్థ ఎంతో ముందుకు వెళ్లాల్సిఉంటుంది. నాలుగేళ్లలో ఒక్క టీచర్నీ నియమించని జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ స్టాండర్డ్ రావాలంటే కనీసం వందేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.