కాకినాడ ఎమ్మెల్యే రౌడీయిజాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారని.. దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. వెంటనే.. వైసీపీ మాటలకు పక్క వాయిద్యాలు మోగించే వాళ్లంతా.. పవన్ కాకినాడలో పోటీ చేయాలంటూ బయలుదేరి వచ్చారు. అయితే పవన్ ఎంత మందిపై పోటీ చేయాలన్నది మాత్రం వారు చెప్పడం లేదు. పవన్ ఎవరిపై విమర్శలు చేస్తే వారు.. దమ్ముంటే తమపై పోటీ చేయాలని విమర్శలు చేస్తూ ఉంటారు. చివరికి దమ్ముంటే పులివెందులలో పోటీ చేయాలన్న సవాల్ కూడా గతంలో చేశారు.
జగన్ మంత్రివర్గంలో ప్రతి కాపు నేత.., మంత్రి పదవి రేసులో ఉండాలనుకున్న ప్రతి నేత కూడా… పవన్ కు ఇలా సవాల్ చేసిన వాళ్లే. పవన్ ను సవాల్ చేస్తే తాము పెద్దవాళ్లం అయిపోయినట్లేనని కొంత మంది ఇలాంటి సవాళ్లు చేస్తే.. మరికొంత మంది మాత్రం.. పవన్ స్పందిస్తే చాలు తమకు గొప్ప పబ్లిసిటీ వస్తుందని హడావుడి చేసేవాళ్లు మరికొందరు ఉంటారు. అయితే అసలు పవన్ ఎంత మందిపై పోటీ చేస్తారన్నది మాత్రం వారు లెక్క చేయడం లేదు.
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చే్యాలనుకునేది నిర్ణయించుకోలేదు. ఈ సారి ఆయన ఆత్మరక్షణ ధోరణిలో ఉండరని.. ఒక్క చోటే పోటీ చేస్తారని అది కూడా ఎవరూ ఊహించని నియోజకవర్గం నుంచి ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఎంత రెచ్చగొట్టినా.. అందరిపైనా పవన్ పోటీ చేయలేరని..పోటీ చేయకపోయినా ఇలా సవాళ్లు చేస్తున్న నేతలందరికీ.. ఓటమి రుచి చూపిస్తారని.. అంటున్నారు.