అధికార బీఆర్ఎస్లో లైంగిక వేధింపులకు పాల్పడే నేతలు పెరిగిపోతున్నారు. గతంలో కొన్ని వ్యవహారాలు బయటపడ్డాయి… మరికొన్ని గాసిప్స్ లా మిగిలిపోయాయి. తాజాగా హైదరాబాద్ సిటీలోని సీనియర్ నాయకుడే ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్పొరేటర్ ఆయన నిర్వాకాన్ని రికార్డు చేసి మరీ పార్టీ పెద్దలకు చూపించినట్లుగా బయటకు వచ్చింది. ఆ కార్పొరేటర్ ఎవరు.. ఆ సీనియర్ నేత ఎవరు అన్నది మాత్రం గోప్యంగానే ఉంది కానీ..బీఆర్ఎస్ వర్గాలకు మాత్రం ఓ స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. ం
ఓ సీనియర్ నేతపై అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ కు అర్థరాత్రి ఫోన్ చేసి..మొదట యోగక్షేమాలు అడిగారు.. తర్వాత అసలు బూతులు ప్రారంభించారు. అప్పటి వరకు ఆదర్శ నాయకుడు అనుకున్న వ్యక్తి అలా మాట్లాడేసరికి మహిళా కార్పొరేటర్ కంగుతిన్నారు. ఆ లీడర్ వాయిస్‌ను రికార్డు చేసి.. పార్ట ీపెద్దలకు పంపించారు. రాజకీయాల్లో భాగంగా తిరిగినంత మాత్రాన తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అంటూ వాపోయారటున్నారు. ఓ మంత్రి వద్ద విషయాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు.
ఫిర్యాదు అందుకున్న అధిష్ఠానం ఆయనపై నిఘా పెట్టిందని.. ఆయనపై గతంలో ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా… అన్న కోణంలో సీక్రెట్‌గా విచారణ చేస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఇలాంటి విషయంలోనే వరంగల్‌కు చెందిన లీడర్లు బద్నాం అవుతున్నారు. రాజయ్య లాంటి వారు ఇలాంటి ఆరోపణలతోనే మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు. హైదరాబాద్ పార్టీ నేతల విషయాన్ని బయటకు వెళ్లకుండా సీక్రెట్‌గా ఎంక్వయిరీ చేస్తున్నట్టు చెబుతున్నారు.