‘ఆదిపురుష్’ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగులు రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, మనోభావాలను, సనాతన ధర్మాన్నీ తీవ్రంగా దెబ్బతీసేలా వున్నాయని, దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లాగా చిత్రీకరించారని ఇలా చాలా విమర్శలు వస్తున్నాయి.
ఐతే ఈ విషయంలో ‘ఆదిపురుష్’ టీమ్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యం సినిమా రచయిత మనోజ్ ముంతాషిర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘అసలు హనుమంతుడు అసలు దేవుడే కాదని.. కేవలం భక్తుడు మాత్రమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మనోజ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రీకరించిన తీరుపై చాలా విమర్శలు వున్నాయి. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ లతో కొత్త వివాదాలు రాజేసి మరింత పెద్దవి చేస్తున్నారు.
అదిపురుష్ పై విమర్శలు వస్తున్నప్పటికీ సినిమా కలెక్షన్ బావున్నాయి. బహుసా ఈ వివాదాన్ని ఇంకా కొనసాగిస్తే అదొక ప్రచారంలా ఉంటుందని యూనిట్ భావిస్తుందేమో కానీ రామాయణం ఆధారంగా తీసిన సినిమాకి కూడా ఇలాంటి వివాదాలు పెంచడం అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.