ఏపీలో నయా పెత్తందారుల్లో ఒకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కు చెందిన రాఘువ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ వేల కోట్ల కాంట్రాక్టులు పొందింది. ఊరకనే అన్నేసి కాంట్రాక్టులు ప్రభుత్వ పెద్దలు ఎందుకిస్తారు.. కమిషన్లు తీసుకుంటారు.. అలాగే రాజకీయ పనులూ చేయించుకుంటారు. ఇప్పుడు పొంగులేటి.. బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయన రాజకీయ అడుగులు వేసే ప్రతి సందర్భంలోనూ జగన్ సలహాలు తీసుకుంటున్నారు.
జగన్ తో పలుమార్లు సమావేశమైన తర్వాత చివరికి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని ఆయనకు జగన్ సూచించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లో మాట్లాడి… చేరికను ఖరారు చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఖమ్మంలో బహిరంగసభ పెట్టి పార్టీలో చేరాలని నిర్మయించుకున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా కాంగ్రెస్ లో చేరితేనే బెటరని నిర్ణయించుకున్నామని పైకి చెబుతున్నారు. కానీ… తానే బలవంతుడనని స్వయంగా అభ్యర్థుల్ని కూడా ప్రకటించుకున్న పొంగులేటి.. ఇలా బలమైన పార్టీ కాంగ్రెస్ అని చేరడంలో తేడా ఉందని అంటున్నారు.
పొంగులేటి గెలిపించుకునేవారంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అయినా ఎన్నికల తర్వాత గేమ్ ఆడవచ్చన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. కాంగ్రెస్ తో అవసరం పడితే పొంగులేటి లాంటి వాళ్ల వల్ల కొన్ని పనులు జరుగుతాయని .. జగన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారని అంటున్నారు.