వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ పవన్ కల్యాణ్ ను తిట్టి సొంత వర్గంలో పరపతి కోల్పోయారు. ఫలితంగా జగన్ వద్ద కూడా వారి పలుకుబడి జీరో అయిపోయింది. కాపుల్ని ఆకట్టుకోవాలంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న కాపు నేతలెవరూ సరిపోరని.. జగన్ కొత్తగా అంబటి రాయుడ్ని ఎంచుకున్నారు. ఆయననే ముందు పెట్టి .. కాపు ఐకాన్ గా ప్రచారం చేయించి కాపు ఓట్లు పొందాలనుకుంటున్నారట.
అంబటి రాయుడు….చివరి ఐపీఎల్ ఆడుతూనే రాజకీయం ప్లాన్ చేసుకున్నారు. చెన్నై కింగ్స్ అధినేత శ్రీనివాసన్,సీఎం జగన్ వ్యాపార స్నేహితులు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీనివాసన్ పేరుంది. ఆయన సలహా మేరకు అంబటి రాయుడు వైసీపీలో చేరిపోయి రాజకీయం చేయాలని డిసైడయ్యారు. ఐపీఎల్ చివరి రోజే రిటైర్మెంట్ ప్రకటించి … ఏపీలో పర్యటనలు ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటిస్తూ అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇంత అద్భుతంగా ఉంటే ఇక రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారనే డౌట్ ఇతరులకు రాకుండా చూసుకుంటున్నారు.
అంబటి రాయుడుని కేవలం ఓ అభ్యర్థిగా కాకుండా కాపు నేతగా వాడుకోవాలని జగన్ ప్లన్ చేస్తున్నారని.. పవన్ కు కౌంటర్ గా రాయుడ్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. కాపులు జగన్ సర్కార్ పై పట్టరానంత కోపంగా ఉన్నారు. .కాపు ಓటు రాష్ట్రంలో నిర్ణయాక శక్తిగా ఉన్న పరిస్తితిలో కాపులు పవన్ వెంట ఉంటే వైసీపీ అధికారంలోకి రావడం కష్టం. . ఈ పరిస్తితులలో కాపు సామాజిక వర్గంలో కొంత చీలిక తేవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకుని రాయుడిని స్టార్ క్యాంపెయినర్ చేద్దామని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
తమను కాపు నేతలుగా సొంత వర్గం కూడా పరగిణించకుండా చేసిన జగన్ ఇప్పుడు కొత్త కాపు నేతను తయారు చేసుకుంటూండటంతో ఇతర కాపు నేతలకు మింగుడు పడటం లేదు. కానీ ఇంకెక్కడా భవిష్యత్ లేకుండా చేశారు కాబట్టి తప్పనిసరిగా వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితి వారిది.