‘‘వాలంటీర్ అంటే స్వచ్ఛందం కాదా? డబ్బులు ఎలా ఇస్తారు? వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? వాలంటీర్లు లబ్ధిదారుడిని ఎంపిక చేయడమేంటి? ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు?’’ .. ఇవి వాలంటీర్ల అక్రమాలపై హైకోర్టులో దాఖలైన హైకోర్టు సంధించిన ప్రశ్నలు. అసలు ఈ వాలంటీర్లు ఎవరు ? ఈ నియామకం ఎలా జరుగుతుంది ?అని లక్షల సంఖ్యలో సాక్షి పత్రికను కొనుగోలు చేయడానికి ప్రజాధనం అప్పనంగా వారికి ఇవ్వడంపై దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సంధించిన ప్రశ్నలివి. వీటికి ఇంకా ప్రభుత్వం సమాధానాలివ్వలేదు. ఇస్తే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ .. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎంత ఘోరంగా దుర్వినియోగం చేసేలా ఏర్పాటు చేశారో స్పష్టమవుతుంది.
ప్రతి 50 కుటుంబాల గుట్టు ఓ వాలంటీర్ చేతుల్లో !
ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ను ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేశారు. ఒక్కో వాలంటీర్కు రూ. ఐదు వేలు చొప్పు నెలకు ఇస్తున్నారు. వారిలో 90 శాతం మంది పార్టీ కార్యకర్తలేనని మొదట్లో వాలంటీర్ నియామక ప్రక్రియను చూసుకున్న విజయసాయిరెడ్డి ప్రకటించారు. తర్వాత వివిధ సందర్భాల్లో వాలంటీర్లు అంతా మన వాళ్లేనని ఎవరైనా తోక జాడిస్తే తీసేయాలని మంత్రులు చేసిన ప్రకటలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాలంటీర్లు ప్రతీ సందర్భంలోనూ వైఎస్ఆర్సీపీకి ప్రచారకర్తలుగా ఉన్నారన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎన్నికలు వచ్చిప్పుడు లేదా సీఎం బహింగసభ పెట్టినప్పుడు ఓటర్లను.. ప్రజలను సమీకరించడం కూడా వాలంటీర్లు చేస్తున్నారు. మ పరిధిలో ఎరెవరు .. వైఎస్ఆర్సీపీ ఓటర్లు కాదో మ్యాపింగ్ చేస్తున్నారు..
ప్రజల వ్యక్తిగత డేటా వాలంటీర్ల చేతుల్లో !
ప్రజల వ్యక్తిగత డేటా .. వాలంటీర్ల చేతుల్లో ఉంది. యాభై ఇళ్లకు సంబంధించిన జనాభా.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వాలంటీర్లకు యాక్సెస్ ఇస్తుంది. వాలంటీర్ అనే వ్యక్తికి ఎలాంటి బాధ్యతా లేదు. అంతకు మించి అధికారం లేదు. అది ఏ మాత్రం చట్టబద్దత లేని వ్యవస్థ. వారు ఉద్యోగులు కాదని ప్రభుత్వమే నేరుగా చెబుతోంది. వారు సేవకులని చెబుతున్నారు. మరి ప్రభుత్వం వద్దే ఉండాల్సిన రహస్య ప్రజల డేటా వారికి ఎలా ఇస్తున్నారు ఆ యాభై ఇళ్లల్లో ఎవరైనా ఒంటరి మహిళలు ఉంటే.. ఆ సమాచారాన్ని వాలంటీర్లు ఎవరికో ఇస్తున్నారని పవన్ అంటున్నారు. నిజానికి అలాంటి సమాచారం .. ఎవరికి ఇచ్చినా ఎవరూ జవాబుదారీ కాదు. కానీ ప్రజల వ్యక్తిగత డేటా మాత్రం వాలంటీర్ల చేతుల్లో ఉన్నదన్నది పచ్చి నిజం.
పథకాల లబ్దిదారులపై సర్వహక్కులన్నట్లుగా వాలంటీర్ల తీరు !
వైసీీపీ సభకు లేదా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసే సభలకు తమ పరిధిలో లబ్దిదారులు రాకపోతే.. వారి పథకాలను కట్ చేసే అధికారం వాలంటీర్ కు ఉంది. అలాగే.. పథకాలకు లబ్దిదారుల్ని సిఫారసు కూడా చేయవచ్చు. ఇదే వాలంటీర్ అంటే పథకాల లబ్దిదారులకు గౌరవం ఇచ్చేలా చేస్తోంది. నిజానికి వాలంటీర్ కు ఇలాంటి వాటిపై ఎలాంటి హక్కూ ఉండదు. ప్రభుత్వ పరంగా లబ్దిదారుల్ని తొలగించాలన్నా.. కొత్తగా ఇవ్వాలన్నా అనేక విధి విధానాలు ఉంటాయి. వాటిని పాటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అల్టిమేట్ వాలంటీర్ కావడం వల్ల సమస్య వస్తోంది. వారికేం సంబంధం అనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి పథకాల లబ్దిదారుల దగ్గర వాలంటీర్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
అనేక కేసుల్లో వాలంటీర్లు
వాలంటీర్లు అనేక రకాల క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారారు. హత్యలు, అత్యాచారాలు, స్మగ్లింగ్, నాటు సారా తయారీ సహా ఘోరమైన నేరాలకు పాల్పడిన వారి జాబితాలో వాలంటీర్లు ఉన్నారు. ప్రజల్ని ప్రభుత్వం తరపున బెదిరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవస్థ రాను రాను నేరస్తుల నిలయంగా మాురతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ దుర్మార్గాలన్నీ వాలంటీర్ల చేతుల మీదుగానే !
ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గాన్ని చేయాలనుకున్నా.. వాలంటీర్లనే ముందు పెట్టి చేయిస్తోంది. తమ రాజకీయకక్షసాధింపులకు.. వాలంటీర్లను వేదికగా వాడుకుంటోంది. చివరికి తమ పత్రిక సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికి కూడా వాలంటీర్లనే వాడుకుంటోంది. వారి పేరుతో డబ్బులు తమ ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇలాంటి ఘోరాలన్నీ.. వాలంటీర్ల వ్యవస్థలో ఉన్నాయి. ఈ వ్యవస్థ చేసిన దురాగతాలన్నీ బయటకు రావాల్సిన సమయం దగ్గర పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.