వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ మిస్ కాగానే సాక్షి పత్రికలో కనీసం ఇంట్లో టీవీలు కూడా లేని పేదవాళ్లు.. గుండెలు పగిలిచచ్చిపోయారని వార్తలు రాసి.. ఫోటోలు వేసి.. నెంబర్ కూడా వేయడం ప్రారంభించారు. చాలా మంది ఎయిడ్స్ పేషంట్లు చనిపోయినా అదే జాబితాలో చేర్చారు. ఎందుకో చాలా మందికి అర్థం కాలేదు. అదే జగన్ రెడ్డి రాజకీయం. ఆయన వారినే చూపించి కాంగ్రెస్ పార్టీకి జెల్లకొడతారని ఎవరూ ఊహించి ఉండరు. తర్వాత వారిని ఓదారుస్తానని… బయలుదేరి…ఓదార్చేందుకు సోనియా ఒప్పుకోలేదని ఆమెను తిట్టి సొంత కుంపటి పెట్టేసుకున్నారు. కాంగ్రెస్ ఆస్తి మొత్తం లాగేసుకున్నారు. అది వేరే విషయం.
ఇప్పుడు టీడీపీ కూడా అదే ఫాలో అవుతోంది. చంద్రబాబును అరెస్ట్ చేశారని..తెలిసిన తర్వాత రెండు రోజుల్లో పాతిక మంది వరకూ చనిపోయారని ప్రచారం చేస్తోంది. ఈ సంఘ్య రెండు,, మూడు వందలకు చేరినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే… పైన మనం చెప్పుకున్న ప్లాన్ కళ్ల ముందే ఉంది. తెలుగేదశం పార్టీ తన పార్టీ కార్యకర్తల్ని ఊరికే అలా గాలికి వదిలేయదు. వారి కుటుంబాలకు కావాల్సినంతగా ఆదుకుంటుంది. అందుకు ఓదార్పు యాత్ర జరుగుతుంది.
ఇప్పటికే భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. సేమ్ సీన్లు రిపీట్ అవుతున్నట్లు అవుతాయని అనుకోవచ్చు. జగన్ రెడ్డి ప్లాన్ తోనే ఆయనను రాజకీయంగా ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని అనుకోవచ్చు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ