చంద్రబాబు ఏ 1 అని విస్తృతంగా ప్రచారం చేశారు. సాక్షిలో బ్యానర్ అదే. టీవీ 9లో అదే. ఎన్టీవీలో అదే. ఇంకా సోషల్ మీడియాలో అదే. సీఐడీ చీఫ్ కూడా ప్రధాన నిందితుడు అనే చెప్పారు. చివరికి ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు జాబితాలో ఏ 1 అని లేదు ఏ 37 అని ఉంది. కానీ రిమాండ్ రిపోర్టు కన్నా… తాము చెప్పేదే నిజం అన్నట్లుగా నీలి, కూలి మీడియా చెలరేగిపోయింది.
రిమాండ్ రిపోర్టులో ఏ 37 అని స్పష్టంగా ఉంది. కానీ ఏ వన్ అంటూ సాక్షి మీడియా కంటే ఘోరంగా ప్రచారం చేశారు. రిమాండ్ రిపోర్టును చూపిస్తూ కూడా అదే చెప్పారు. ఎవరి కళ్లల్లో ఆనందం కోసం ఇలా ప్రచారం చేశారో తెలియాల్సి ఉంది. కళ్ల ముందు కనిపించే నిజాల్ని ఇలా మ్యానిపులేట్ చేయడం ఏమిటో … అసలు అదేం జర్నలిజమో… వాళ్లకే తెలియాలి.
ఈ విషయంలో నెంబర్ వన్, టు చానళ్ల జీన్స్ ఒక్కటేనని మరోసారి రుజువు అయింది. వాళ్ల సూపర్ ఎడిటర్ తాడేపల్లిలో సలహాదారు రూపంలో ఉంటారు. అక్కడ ఇద్దరు రిపోర్టులు కొట్టుకున్నా ఆయన దగ్గరకే పంచాయతీకి పోతారు ఎందుకంటే.. ఆయనే అనధికారిక ఎడిటర్. ఆయన సూచనల ప్రకారమే నడిపించారు. ఈ రోజుంతా.. సీఐడీ కోర్టులో స్కిల్ స్కామ్ పేరుతో జరిగిన వాదనల్లో సీఐడి రిమాండ్ రిపోర్టు గురించి చెప్పారు కానీ చంద్రబాబు తరపు లాయర్ల వాదన గురించి .. ఆయన లేవనెత్తిన అంశాల గురించి చెప్పడానికి వారికి మనసు రాలేదు. రానీయలేదు.
ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం పూర్తిగా వ్యక్తిగత కక్షల వైపు మారిపోయింది. ఈ రోజు పవర్ వారి వైపు ఉంది. టీడీపీ పోరాడుతోంది. రేపు పవర్ మారితే.. . టీడీపీ నేతలూ వ్యక్తిగతంగానే తీసుకుంటారు. అప్పుడు ఈ మీడియా సంస్థలకు పోటీ సంస్థల నుంచి … ఇతర మీడియా సంస్థల నుంచి కనీస సానుభూతి కూడా రాదు. అంత ఘోరమైన జర్నలిజాల్ని ఈ రెండు చానళ్లు ప్రదర్శించాయి.