చంద్రబాబు పధ్నాలుగేళ్లు సీఎంగా ఉండి పధ్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రజల కోసం ఖర్చు పెట్టారని కానీ ఎప్పుడూ ఆయనపై ఆరోపణలు రాలేదని టీడీపీ మాజీ నేత ,, చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ కోసం గత ఎన్నికల్లో నోటికి పని చెప్పిన మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా అదే నిరూపిస్తున్నారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. చంద్రబాబుకు ఎక్కడి నుంచైనా రూపాయి ముట్టినట్లుగా ఏకేసులోనూ తేల్చలేకపోతున్నారు.
రూ. 6 లక్షల కోట్లంటూ పుస్తకాలు – కానీ పెట్టీ కేసులు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ మొత్తం స్కామేనని జగన్ రెడ్డి పుస్తకాలు వేయించి ఊరూవాడా ప్రచారం చేశారు. చివరికి రాష్ట్రపతికి కూడా ఇచ్చి వచ్చేవారు. అధికారంలోకి వస్తే ఆరు లక్షల కోట్లు కక్కిస్తామనేవారు. అధికారంలోకి వచ్చాక… చంద్రబాబుకు వరుసగా క్లీన్ చిట్లు ఇస్తూ పోయారు. పోలవరంలో అవినీతి ఉందని బంధువు అయిన ఓ వ్యక్తితో గాల్లో నివేదిక రాయించారు. దాన్ని కేంద్రానికి పంపారు. ఆధారాలు పంపే వరకూ పోలవరంకు నిధులు ఆపేస్తామంటే దాన్ని వెనక్కి తీసుకుని పోలవరంలో అవినీతి లేదన్నారు. ఇలా అన్ని చోట్లా జరిగింది. చివరికి హెరిటేజ్ కొన్ని మజ్జిగ ప్యాకెట్ల సరఫరాను టెండర్లలో దక్కించుకుంటే దాంట్లోనూ అవినీతేనన్నారు. అన్న క్యాంటీన్లను కోట్లతో నిర్మించారన్నారు. అన్నీ తేలిపోయాయి. అన్నింటిలోనూ క్లీన్ చిట్ ఇచ్చేశారు.
నిధుల దుర్వినియోగమా ? అవినీతా ?
చంద్రబాబుపై పెట్టిన రెండు, మూడు పెట్టి కేసుల్లో సీఐడీ కన్వీయనెంట్ గా పదాలు మార్చి కోర్టుల్ని మోసం చేస్తోంది. ఓ సారి దుర్వినియోగం అయ్యాయంటారు. మరో సారి అవినీతి జరిగిందంటారు. అవినీతి జరిగిందని చెప్పాలంటే.. డబ్బులు ఎవరెవరికి చేరాయో చెప్పాలి కదా. ఆ డబ్బుల లెక్కలన్ని డిజైన్ టెక్.. బ్యాంక్ ఇన్వాయిస్ లతో సహా సీఐడీకి ఇచ్చింది. అందులోనే సీఐడీచెబుతున్న లెక్కలు ఉంటాయి. మరి కనిపెట్టడం పెద్ద కష్టమా ? . ఇన్నర్ రింగ్ రోడ్‌కు రూపాయి ఖర్చు చేయలేదు కాబట్టి అవినీతి అనే ప్రశ్నేలేదు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులోనూ ఖర్చులన్నీ కళ్ల ముందే ఉన్నాయి. బిల్లులున్నాయి. వీటన్నింటిని పక్కన పెడితే చంద్రబాబుకు రూపాయి వచ్చినట్లుగా ఒక్క ఆధారం సీఐడీ దగ్గర లేదు.
చివరికి అన్నింటిలోనూ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇప్పించేస్తారు !
పరిస్థితిచూస్తూంటే.. ఒక్క ఆధారం చూపించలేక చంద్రబాబుకు అన్నింటిలోనూ క్లీన్ చిట్ ఇప్పించేసేలా ఉన్నారు. ఇది జగన్ రెడ్డి ఊహించని పరిణామమేమీ కాదు. ఎందుకంటే ఆయనకూ తెలుసు. ఎందుకంటే శిక్ష ఇప్పటికే వేసేశారు. మొదటి నుంచి తప్పుడు కేసులో అర్థరాత్రిళ్లు అరెస్టు చేయడం… తర్వాత కోర్టులో పెట్టి… వేధించడం చేస్తున్నారు. దేంట్లోనూ చార్జిషీట్లు దాఖలు చేయలేదు. అంటే శిక్ష వేస్తున్నారన్నమాట. చంద్రబాబుకూ అదే న్యాయం అమలు చేశారు. దానికి రిటర్న్ గిఫ్ట్ టీడీపీ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది.