రాగానే వరంలో సీపీఎస్ రద్దు అంటూ ప్రకటించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఉద్యోగుల గొంతును తడిగుడ్డతో కోసేశారు సీఎం జగన్ రెడ్డి, సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు రావని… అసెంబ్లీలో చెప్పుకున్న బుగ్గన .. జీపీఎస్ బిల్లును ఆమోదింప చేసుకున్నారు. మరి ఉద్యోగులకు ఇచ్చిన హామీ సంగతేంటి ? . హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసి పోవాలన్న ఆదర్శాలు చెప్పిన జగన్ రెడ్డి సంగతేంటి ? .
ఇవన్నీ పక్కన పెడితే కొత్త జీపీఎస్ బిల్లులో ఉన్న నిబంధనలు చూసిన ఉద్యోగులకు కడుపు మండిపోతుంది. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత తమకు బానిసలుగా ఉంటేనా అందులో కల్పించే ప్రయోజనాలు వస్తాయన్నట్లుగా రూల్స్ పెట్టారు. సక్సెస్ ఫుల్ కెరీర్ పూర్తి చేసి రిటైర్ అవుతున్న వారికి కండక్ట్ సర్టిఫికెట్ కావాలట. ఇంత కన్నా అవమానం ఉద్యోగులకు ఉంటుంది. తమ చెప్పుల కింద రిటైర్మెంట్ ఉద్యోగులు పడి ఉండేలా ఈ నిబంధనలు పెట్టారు.
ఉద్యోగుల అనుమతి లేకుండా ఎవరూ బిల్లులు పెట్టరు. వారి ప్రయోజనాల విషయంలో వారి అనుమతితోనే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జగన్ రెడ్డి సర్కార్ మాత్రం తాము అనుకున్నదే చేస్తామని అంటోంది. అనుకున్నట్లే చేస్తోంది. చివరికి ఉద్యోగులు బలైపోయారు. జగన్ రెడ్డి నమ్మి నట్టేట మునిగిపోయారు. ఇక వారిని ఎవరూ కాపాడలేరు.