శ్రీలీల మంచి డాన్సర్. ఈ విషయంలో తిరుగులేదు. తను లక్కీ గాళ్ కూడా. ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్టు. తాజాగా… `భగవంత్ కేసరి` కూడా ఇదే నిరూపించింది. అయితే… ఈ టాలెంటెడ్ గాళ్ కుర్ర హీరోలకు ఓ రకమైన ఇబ్బందికి గురి చేస్తోంది. శ్రీలీల తో సినిమా అనగానే డాన్స్ మాస్టర్లు శ్రీలీలకంటూ కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇది వరకు హీరోల్ని దృష్టిలో ఉంచుకొని డాన్స్ కంపోజ్ చేసే మాస్టర్లు కూడా.. ఇప్పుడు శ్రీలీలపైనే ఫోకస్ చేస్తున్నారు. అసలే.. శ్రీలీల పాటంటే కళ్లన్నీ ఆమెపైనే ఉంటాయి. దానికి తోడు.. ఇప్పుడు డాన్స్ మాస్టర్ల చొరవ ఒకటి కలిసొచ్చింది. ఇది కుర్ర హీరోల్ని ఇబ్బంది పెట్టే విషయమే.
`ఆది కేశవ` నుంచి ఓ పాట బయటకు వచ్చింది. పాట పేరు కూడా… `లీలమ్మా..`నే. ఈ పాటలో కెమెరా ఫోకస్ వైష్ణవ్ తేజ్ పై కంటే.. శ్రీలీలపైనే ఉంది. పాట ఎలా ఉంది? ట్యూన్సంగతేంటి? అనేది పక్కన పెడితే.. శ్రీలీల సిగ్నేచర్ స్టెప్పులు మాత్రం అదిరిపోయాయి. వైష్ణవ్ శ్రీలీల పక్కన సపోర్టింగ్ రోల్ లా అనిపిస్తున్నాడంతే. వైష్ణవ్ డాన్సర్ కాదా.. అంటే.. తను కూడా మంచి డాన్సరే. కాకపోతే.. శ్రీలీల ముందు ఆనలేకపోతున్నాడు. ఇది వైష్ణవ్ ఒక్కడి సమస్య కాదు. వైష్ణవ్ లాంటి యంగ్ హీరోలందరి సమస్య. స్వతహాగా.. హీరోలు డాన్సుల్లో తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకొంటారు. శ్రీలీల దానికి గండి కొట్టింది అంతే.