చిత్రసీమలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఏ దర్శకుడూ ఖాళీ లేడు. ఏ హీరో అందుబాటులో లేడు. అందరూ బిజీ బిజీనే. ఇంత బిజీలోనూ.. ఖాళీగా ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి. పైగా.. `వారసుడు` లాంటి హిట్ ఇచ్చిన తరవాత కూడా వంశీ ఇలా సినిమాల్లేకుండా ఉండడం విచిత్రం. నిజానికి తమిళ హీరో విజయ్ తో.. మరో సినిమా చేయాల్సింది. కానీ… విజయ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తమిళ రాజకీయాలపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు.. మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ సినిమా తరవాత… రాజమౌళి ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఇలా హీరోలంతా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. పైగా వంశీ కూడా వెంట వెంటనే సినిమాలు చేసే రకం కాదు. తాయితీగా, నిదానంగా రెండేళ్లకో సినిమా చేసుకొంటూ వెళ్తాడు. సడన్గా ఏ హీరో అయినా ఖాళీ అవుతాడేమో, ప్రాజెక్ట్ సెట్ చేద్దాం అని చూస్తున్నాడు. తెలుగులో కంటే తమిళ హీరోలే కాస్త అందుబాటులో ఉన్నారిప్పుడు. శివ కార్తికేయన్, ధనుష్…ఇలాంటి హీరోల్ని పట్టుకొంటే వంశీకి ఓ సినిమా సెట్ అవ్వొచ్చు. మన హీరోలే కావాలంటే మరో యేడాదైనా ఆగాలి.