తెలంగాణలో పోటీ చేయడానికే టీడీపీ మొగ్గు చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ చేసిన వ్యాఖ్యలు దీన్నే బలపరుస్తున్నాయి. టీడీపీ పోటీ ఖాయమని స్పష్టం చేశారు. పోటీకి దూరంగా ఉండే ప్రశ్నేలేదన్నారు. బీజేపీతో పొత్తు గురించి క్లారిటీ లేదని.. ఆదివారం లోకేష్ తో ఈ అంశంపై చర్చించిన తర్వాత ప్రకటన చేస్తామన్నారు. మరో వైపు లోకేష్ కూడా.. తెలంగాణ ఎన్నికలపై కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద్ లో మాట్లాడతారని చెప్పారు.
టీడీపీ తో పాటు జనసేనను పోటీకి దూరంగా ఉండేలా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో ఉన్నాయి. జనసేన పార్టీతో పొత్తు చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు కానీ.. బేషరతుగా మద్దతు ఇచ్చి పోటీ నుంచి వైదొలగాలని అడుగుతున్నట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ పైనా అలాంటి ఒత్తిడే ఉందని అంటున్నారు.చంద్రబాబు విషయంలో జరుగుతున్న పరిణామాల వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయంలో వెనక్కి తగ్గేలా లేరని అంటున్నార.ు
టీడీపీలో పోటీ చేయడానికి చాలా మంది నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చంద్రబాబు నుంచి క్లారిటీ తీసుకోవాలని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆదివారం ఈ అంశపై కాసాని స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తులంటూ ఉంటే.. సీట్ల సర్దుబాటు చర్చలు తెగవని.. అలాంటి అవకాశం కూడా లేదని భావిస్తున్నారు.