వినడానికే కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆయన పేరు గోదావరి బాబు. ఆయన పేరు మోసిన జేబు దొంగ . కొంత కాలం వరకూ తాడేపల్లిలో ఉండేవాడు. ఆయనపై సస్పెక్ట్ షీట్ ఉంది. తర్వాత వైసీపీలో తన లాంటి వారికి మంచి భవిష్యత్ ఉంటుందని తెలుసుని ఆ పార్టీలో చేరిపోయారు. విజయవాడకు మకాం మార్చాడు. వైసీపీ పెద్దలు గోదావరి బాబును ఏ మాత్రం నిరాశపర్చలేదు. ఆయనకు కార్పొరేటర్ టిక్కెట్ కేటాయించారు. అయితే ఆయన ఎంచుకున్న డివిజన్ మహిళలకు రిజర్వ్ కావడంతో ఆయన భార్యకు టిక్కెట్ ఇచ్చారు. జనం కూడా జేబు దొంగ భార్య కదా జగన్ రెడ్డి జమానాలో అలాంటి వాళ్లే కావాలని గెలిపించారు.
అయితే గోదావరి బాబు తన స్కిల్ ను ఉపయోగించి సంపాదన మాత్రం వదిలి పెట్టలేదు. ఎక్కడ సమూహాలు ఉంటాయో అక్కడ తన ముఠాతో కలిసి దిగిపోతారు. ఫోన్ల మాయలో ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తున్న సమయంలో జేబులు ఖాళీ చేస్తారు. గుర్తించేలోపు.. తన ముఠాలో వేరే వారికి ఇచ్చి పంపేస్తారు. చంద్రబాబు విడుదల తర్వాత విజయవాడలో ప్రజలు గుమికూడినప్పుడు అదే చేశాడు. పోలీసులకు దొరికాడు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయలేదని … పోలీసులు కేసు పెట్టకుండా వదిలేశారు.
గోదావరి బాబు వ్యవహారం… విజయవాడ ప్రజలను తలదించుకునేలా చేసింది. అయితే వైసీపీ నేతల చరిత్రను బయటకు తీస్తే.. అన్నీ చిల్లర దొంగలు..జేబు దొంగలు.. ఇతర నేరాలు చేయడమే అర్హతగా ఆ పార్టీలో పెరుగుతున్నవారే. వారికే ఆ పార్టీలో అందలం. రాజు బడాచోర్.. ఆయన అనుచరులు చిన్న చోర్స్…. సిగ్గుపడాల్సింది వారిని ఎన్నుకున్న ప్రజలే.