ఢిల్లీకి వెళ్లి లోకేష్ ఏం చేసి వస్తున్నారు ? . ఇదే వైసీపీ నేతలకు ఇప్పుడు పెద్ద పజిల్ గా మారింది. చంద్రబాబుకు మద్యంతర బెయిల్ లభించిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యే సమయంలో రాజమండ్రిలో ఉన్నారు. తర్వాత కొన్ని గంటలకే ఢిల్లీ వెళ్లారు. ఆ రోజు సమావేశాల తర్వాత బుధవారం సాయంత్రానికి మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. గతంలో నెల రోజుల వరకూ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నారన్నది వైసీపీ నేతలకు టెన్షన్ గా మారింది.
న్యాయనిపుణులతో సంప్రదింపుల కోసమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ లోకేష్ అంతకు మించి రాజకీయం ఏదో చేస్తున్నారని అనుమానిస్తున్నారు. హఠాత్తుగా రఘురామకృష్ణరాజు జగన్ కేసుల్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలని పిటిషన్ వేయడం.. అది శుక్రవారం విచారణకు రానుండటంతో జగన్ కేసుల్ని ముందుకు తీసుకెళ్లాలా లోకేష్.. పెద్ద స్థాయిలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారన్న అనుమానాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు కేసుల్లో కనీస ఆధారాలు కూడా సీఐడీ చూపలేకపోవడంపై ఇప్పటికే జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. న్యాయవర్గాల్లోనూ ఈ అంశంపై లోకేష్ చర్చ పెట్టగలిగారని అంటున్నారు. అదే సమయంలో ఓ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న జగన్.. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న అంశాన్ని కూడా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాని 0అంటున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటలను తేలిగ్గా తీసుకోలేమని… ఏదో చేస్తున్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.