వైసీపీ రేంజ్ లో రాజకీయం చేయడంలో బీఆరఎస్ విఫలమయింది. కోడికత్తి దాడి తర్వాత జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన రాజకీయం తరహాలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి విషయంలో రాజకీయం చేయడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. హరీష్ రావు ఎంతగా హడావుడి చేసినా… కేసీఆర్, కేటీఆర్ స్వయంగా కాంగ్రెస్ పై ఆరోపణలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
పోలీసుల ప్రాథమిక విచారణ చేసి ఎంపీపై దాడిచేసిన వ్యక్తి కేవలం సంచలనం సృష్టించడానికే ఈ చర్యకు పాల్పడ్డట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మీడియాకు చెప్పారు. నిజానికి దళిత బంధు రాలేదన్న కోపంతోనే దాడి చేశారన్న అనుమానాలు ఉన్నాయి. అలా చెబితే… అధికార పార్టీకి ఇబ్బంది కాబట్టి సంచలనం కోసం అన్నట్లుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా పోలీసులు ప్రకటన చేశారంటున్నారు. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ స్పందన చూసిన తర్వాత ఎక్కువ మంది కోడికత్తి ఘటననే గుర్త చేసుకున్నారు.
రాజకీయ ప్రయోజనాలను ఆశించి సభలు, సమావేశాలు, ట్వీట్ల ద్వారా స్టేట్మెంట్లు ఇచ్చారు. సోషల్‌మీడియాలోనూ భారీగా పోస్టులు పెట్టారు. రాజకీయ పార్టీలను సైతం తప్పుబట్టారు. చికిత్స సందర్భంగా ఆస్పత్రిలోనూ హడావిడి చేశారు. ఈ ఘటనను ఎన్నికల్లో లబ్ధికోసం ఉపయోగించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నేతల నుంచి గట్టిగానే జరిగింది. కానీ చివరికి తేలిపోయింది.