అంతో ఇంతో ఆదాయం, ఆస్తులు ఉన్న ఏపీ టూరిజంను వైసీపీ నేతలు పీల్చి పిప్పి చేస్తున్నారు. ఆస్తులు తనఖాలు పెట్టేసి వందలకోట్లు అప్పులు తెచ్చి కూడా ఒక్క చోట హోటల్ కానీ.. మరో అభివృద్ధి కానీ చేయని ప్రభుత్వం… వైసీపీ నేతలకు.. వారు సిఫారసు చేసిన వారికి ఇష్టారీతిన ఉద్యోగాలిస్తూ … లక్షలు చెల్లిస్తూ ఏపీ టూరిజం ఆదాయం మొత్తం కరిగించేస్తున్నారు.
గతంలో ప్రభుత్వం 39900 రూపాయల కన్నా జీతం ఎక్కువ ఇచ్చే వారిని నియమించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. అందుకే… వైసీపీ నేతలు ఇక్కడ అతి తెలివి ప్రయోగిస్తున్నారు. జీతం 39900 రూపాయలు ఖరారు చేసి.. ఇతర ఖర్చుల పేరుతో అరవై వేలు ఇస్తున్నారు. అంటే లక్ష రూపాయలు. ఇలా కనీసం ఆరేడు మందిని ఇటీవలి కాలంలో నియమించారు. వారంతా వైసీపీ నేతలు సిఫారసు చేసిన వారే. వారికి ఎలాంటి విధులూ ఉండవు. చేసే పని ఉండదు.
టూరిజం కార్పొరేషన్ ను ఇప్పటికే వరప్రసాదర్ రెడ్డి అనే వ్యక్తి చేతుల్లో పెట్టారు. ఇతను క్రిస్టియన్. తన లాగే మతం మారిన వారికి ప్రాధాన్యం ఇస్తారని.. అదీ కూడా రెడ్డి సామాజికవర్గాన్నే పట్టించుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా… సొంత సంస్థలాగా… వ్యక్తిగత పర్యటనలకు… విదేశాలకు వెళ్లినా టూరిజానికే బిల్లులు పెడతారు. సొంత వాడకానికి కొత్త కార్లు కొనిపిస్తారు. దీనికి తోడు అదనంగా.. .. ఏ మాత్రం పని ఉండని వారిని లక్షలు ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నారు
మరో వైపు ఏపీ టూరిజంలో…. సగానికిపైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారు వెట్టి చారికి చేస్తున్నా.. వారి జీతం ఇరవై వేలలోపే ఉంటుంది. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. వారికి కొన్ని అలవెన్స్ లు లేదా…. జీతం పెంచడం వంటివి చేయమన్నా చేయరు. కానీ వారి కష్టం మీద వచ్చే ఆదాయాన్ని మాత్రం ఇతరులకు పంచి పెడుతున్నారు.