తెలంగాణను వదిలిపెట్టి భారత్ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు మార్చుకున్నా.. ఎన్నికల్లో గెలవాలంటే తెలంగాణ సెంటిమెంట్ తప్పదని.. బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే అవకాశం దొరకగానే.. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. తెలంగాణను గెలిపించినట్లని ప్రకటనలు చేస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. తెలంగాణ ద్రోహుల పార్టీలతో.. ప్రతిపక్షాలు వస్తున్నాయని అవన్నీ తెలంగాణపై కుట్ర చేయడానికి వస్తున్నాయని చెబుతున్నారు. సంగారెడ్డిలో ఓ సభలో మాట్లాడిన హరీష్ రావు.. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చారని తాను పదకొండు రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారని అలాంటి పార్టీతో కలసి వస్తోందన్నారు.
ఇప్పటి వరకూ జనసేన ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయలేదు. ఇప్పుడు బీజేపీతో కలిసి పది స్థానాలల్లో పోటీ చేయబోతోందనగానే.. ఆ పార్టీపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడానికి హరీష్ రావు రెడీ అయిపోయారు. పవన్ కల్యాణ్ తెలంగాణపై ఎంతో ప్రేమతో ఉంటారు. బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినప్పుడు ఆయన తెలంగాణ ద్రోహిగా అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీతో పొత్తనగానే ద్రోహి అనేస్తున్నారు. హరీష్ రావు ఒక్క పవన్ కాదు.. షర్మిలనూ అంతే్ అన్నారు. కాంగ్రెస్ కు షర్మిల మద్దతు ప్రకటించారని.. వైఎస్ తెలంగాణ ద్రోహి అన్నారు. షర్మిల కూడా తెలంగాణను వ్యతిరేకించారన్నారు.
చంద్రబాబు కూడా లోపల్లోపకాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని.. వీరంతా తెలంగాణకు వ్యతిరేకులన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో కలిసి ఇతర పార్టీలు వస్తున్నాయని.. ఆ పార్టీలన్నింటినీ తిరస్కరించాలన్నారు. అన్ని అస్త్రాలు అయిపోయాయినా హోప్స్ లేవని మళ్లీ తెలంగాణ అంటున్నారని హరీష్ రావుపై ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు.