అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రతిపక్ష నేతలపై వేధింపులకు పూర్తి స్థాయిలో బరి తెగిస్తున్న సీఐడీ అధికారులు పొరుగు రాష్ట్రాల్లో న్యాయస్థానాల ముందు తలదించుకోవాల్సి వస్తోంది. మార్గదర్శి విషయంలో చేసిన అత్యుత్సాహ ప్రదర్శనకు… కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయి. క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్గదర్శి ఎండీ శైలజపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటే…కేంద్రానికి ఏపీసీఐడీ అధికారులు లేఖ రాశారు. అప్పటికే కోర్టు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా లేఖ రాశారు. దీనిపై మార్గదర్శి ఎండీ .. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణలో సీఐడీ డీఎస్పీ హైకోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. చేతులు కట్టుకుని కేంద్రానికి లేఖ ఉపసంహరించుకున్నామని తెలిపారు . అసలు ఎందుకు రాశారు.. క్షమాపణ చెప్పారా అని కోర్టు అడగడంతో సీఐడీ అధికారుల పరువుపోయినట్లయింది.
అయితే తాము లేఖలు రాస్తే శైలజ స్పందించలేదని అందుకే లేఖలు రాశామని సీఐడీ వాదించింది. కానీ వెంటనే సీఐడీ మెయిన్ చేసిన ప్రతి సారి స్పందించామని మార్గదర్శి ఎండీతరపు న్యాయవాదులు కోర్టు ముందు సాక్ష్యాలు పెట్టారు. ఇప్పుడు సీఐడీ అధికారులు క్షమాపణ అయినా చెప్పాలి… లేదా కోర్టు ధిక్కరణ చర్యలు అయినా ఎదుర్కోవాలి. రెండూ ఎదుర్కోవాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. చేసిన తప్పులకు … సీఐడీ అధికారులు ఇవాళ కాకపోతే రేపైనా బలికాక తప్పని ఇాలాంటి పరిణామాలు నిరూపిస్తూ ఉంటాయి.