తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు అంశం హాట్ టాపిక్ అవుతోంది. రేవంత్ రెడ్డి రైతు బంధు ఆపమన్నారంటూ.. బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ధర్నాలు చేశారు. రోజంతా ప్రెస్ మీట్లు పెట్టారు. రైతులు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలన్నారు. కానీ రేవంత్ అడ్డుకున్నా తాము ఇస్తామని చెప్పలేదు. ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. పోలింగ్ కు ముందే రైతు బంధు ఇస్తామని కేసీఆర్ కూడా చెప్పడం లేదు. ఎన్నికలు ముగియగానే ఇస్తామంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరు రాజు… ఎవరు పేద అన్నది తేలుతుంది.
కానీ 2018లో పాత పథకమేనని చెప్పి మరీ .. పోలింగ్ కు ముందు రైతు బంధు చెక్కులు పంచారు కేసీఆర్. కానీ ఇప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. అసలు ఎన్నికలు సంఘం ను రైతు బంధు డబ్బులు వేస్తామని అడగలేదట.. అలాగే.. రైతు బంధు ఆపాలని .. కాంగ్రెస్ వైపు నుంచి కానీ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదట. ఇదే విషయాన్ని సీఈవో స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తారా.. ఇచ్చే ఉద్దేశంలో లేరా అన్న డౌట్ రైతులకు వస్తోంది .
ఎన్నికలకు ముందు ఓటర్లకు లబ్ది చేకూర్చడానికి కేసీఆర్ ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు. కానీ ఆర్థిక సమస్యలు పెరిగిపోవడంతో ఈ సారి ఏమీ చేసే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. కనీసం రైతు బంధును ఎన్నికలకు ముందు వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటారని అనుకున్నారు. కానీ అలాంటి వెసులుబాటు కూడా లేకుండా చేసుకున్నారని.. అందుకే.. ఎన్నికల తర్వాత ఇస్తామంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రైతు బంధు రైతులఖాతాల్లో జమ చే.యకపోతే… గతంలో ప్లస్ అయింది.. .. ఈ సారి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.