ఆంధ్రప్రదేశ్లో దళితలుపై జరుగుతున్న అరాచకాలు నివ్వెర పరుస్తున్నాయి. వాళ్లని అత్యంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు డాక్టర్ సుధాకర్ దగ్గర్నుంచి ప్రారంభమైన ఈ వ్యవహారం కంచికచర్ల శ్యామ్ వరకూ ఎన్నో జరిగాయి. ఎవరికీ న్యాయం జరుగుతున్న సందర్భం లేదు. ఇవన్నీ బయటకు తెలిసినవే. బయటకు తెలియనివి.. పోలీసులు తొక్కి పెట్టేసినవి.. గ్రామాల్లో పెద్దలుపంచాయతీల చేసినవి ఎన్ని ఉంటాయో అంచనా వేయడం కష్టం.
దళితలకు అన్యాయం, అవమానం జరిగినప్పుడల్లా టీడీపీ నేతుల పోరాడుతున్నారు. దీంతో రెండు, మూడు రోజులు ఆలస్యంగా అయినా కేసులు పెడుతున్నారు. కానీ ఆ కేసుల్లో ఎలాంటి పురోగతి ఉండదు. అయినా ఏదో ఒకటి న్యాయం కోసం ఓ అడుగు ముందుకు పడినట్లు అవుతోంది. కానీ అసలు నేరం చేయకుండా… దళితులపై దాడులు చేయాలంటే భయపడేలా పోలీసుల చర్యలు ఉండటం లేదు. కంచికచర్ల శ్యామ్ అనే యువకుడిపై దాడి చేసి… దాహం వేస్తోందంటే మూత్రం పోశారట.. నలుగురు వైసీపీ యువజన నేతలు. వీరంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు.
చీరాలలో కిరణ్ హత్య దగ్గర్నుంచి ఎన్నో దళితలపై దాడుల ఘటనలు జరిగాయి. చివరికి దళితుడ్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైసీపీ ఎమ్మెల్సీది. ఎప్పటికప్పుడు ప్రతిపక్షం పోరాడటమే కానీ.. దళిత సంఘాలు.. వీళ్లు మన బిడ్డలే అని ముందుకు రాలేదు. పోరాడటం లేదు. దీంతో వాళ్ల బిడ్డలకు అన్యాయం జరిగిపోతోంది. బయటకు వస్తే ఎక్కడ కేసులు పెడతారో అని భయపడుతున్నారు. ప్రభుత్వంలోని దళిత నేతుల… ఎన్ని నేరాలు జరిగినా అది తమ పరిధిలోకి రాదన్నట్లుగా ఉంటున్నారు. నోరెత్తితే వాళ్ల పదవులకు గ్యారంటీ ఉండదు.
దళితలకు మేలు చేయడం.. బుజ్జగించడం వల్ల ఉపయోగం ఉండదని….వారిపై దాడులు. దౌర్జన్యాలతో భయపెట్టి ఓట్లు వేయించుకోవాలన్నది వైసీపీ వ్యూహమని అందుకే… ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏదైనా దళిత వర్గాలు తమ అస్తిత్వాన్ని టార్గెట్ చేసుకున్న వారిని గుర్తించకపోతే… ఎదురుదాడి చేయకపోతే… డోర్ డెలివరీలు.. మూత్రం ఘటనలు పెరుగుతాయి. మద్యయుగం నాటికి తీసుకెళ్లిపోతారు.