ఓటర్ జాబితాను గోల్ మాల్ చేసి ఎన్నికలకు వెళ్లాలని దురాలోచనతో ఏపీ ప్రభుత్వం ఉందని తెలుస్తూనే ఉంది. వాలంటీర్లను ఉపయోగించుకుని క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు పంపి.. ఇప్పటికే.. తీసేయాల్సిన ఓట్ల జాబితాను ఖరారు చేసుకుని ఆ తర్వాత తాడేపల్లి కేంద్రంగా ఓ పెద్ద ముఠాను ఏర్పాటు చేసి.. తీసివేతల.. చేర్చివేతల ప్రక్రియ చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ముఠాకు నాయకుడు. జగన్ రెడ్డి ఆలోచనల ప్రకారం ఓట్ల తీసివేత ప్రక్రియ చేస్తున్నారని టీడీపీ ఇప్పటికీ పలుమార్లు ఆరోపించింది.
ఓటర్ల జాబితాలో అక్రమాలపై మీడియా చురుకుగా స్పందిస్తోంది. ఎక్కడి నుంచి లోపాలు ఉన్నా బయటపెడుతోంది. అయితే వాటినీ కరెక్ట్ చేయడం లేదు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు మూడు చోట్ల ఓటు ఉంది. గతంలోనే ఇది బయటపడింది. కానీ సవరించిన జాబితాను తీసేయలేదంటే ఎంత బరి తెగింపో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు మద్దతు తెలుపుతారు అనుకున్న పది వేల మంది ఓట్లు గల్లంతు చేయాలన్న లక్ష్యంతో ప్రస్తుతం పని నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే చాలా వరకూ సక్సెస్ అయ్యారని అంటున్నారు.
ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉండరు. ప్రభుత్వ సిబ్బందితోనే అన్ని పనులు చేయించాలి. ప్రభుత్వ సిబ్బంది అధికార పార్టీ అదుపాజ్ఞల్లో ఉంటారు. వారికి ఇష్టం లేకపోయినా వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. లేకపోతే ఏమవుతుందో ఇప్పటికే కళ్ల ముందు చూపించారు. అందుకే చాలా మంది బూత్ లెవల్ ఆఫీసర్లు వణికిపోతున్నారు. కొంత మంది బలైపోయారు. మరికొంత మంది బిక్కుబిక్కుమంటున్నారు . అయితే ఇవన్నీ తెలిసినా ఈసీ ఎందుకు సైలెంట్ గా ఉంటోందన్నదే కీలకం.
టీడీపీ కోర్టుకెళ్లి పోరాడితే పర్చూరులో కొంత మందిపై కేసులు పెట్టారు. కానీ రాష్ట్రం మొత్తం అలానే ఉందని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఎందుకిలా అనేదే .. ప్రజలకూ పజిల్‌గా మారింది